యువ భారత దేశం. 125 కోట్ల జనాభా. పుంజుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ. ఎన్నో అవకాశాలు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్నే శాసించబోయే సత్తా ఇవన్నీ మన భారతావని ప్రత్యేకతలు.
ఎంతో కాలంగా వివిధ కారణాల వల్ల గడ్డు కాలం ఎదుర్కొన్న భారత విమానయన
రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందా అంటే అవుననే చెప్పాలి. కింగ్ ఫిషర్ దివాలా తీయడం
, ఆర్ధిక సంక్షోభం కారణంగా తగ్గిన ప్రయాణికుల సంఖ్య, విపరీతంగా పెరిగిన చమురు ధరలు,
అంతకంతకు పెరుగుతున్న అప్పులు , వ్యాపార నష్టాలు ఇది ఒకప్పటి భారత విమానయన రంగం పరిస్థితి.
ఐతే ప్రస్తుతం ఈ రంగం మీద కమ్ముకున్న నీలి నీడలు ఒక్కొకటిగా తొలిగిపోయి
ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడి ప్రభుత్వ సహకారం, అంతర్జాతీయం గా చమురు ధరల్లో
తగ్గుదల, పురోగమిస్తున్న ఆర్ధిక వ్యవస్థ ఈ రంగాన్ని ఆదుకున్నాయి. ఒక విమాన రంగ
సంస్థ ఆదాయంలో 40 శాతం విమాన ఇంధనం కోసం వెచ్చించాలి. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు గణనీయంగా
తగ్గడం వలన ఈ రంగం లాభాల బాట పట్టబోతుంది. గడచిన 3 త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే
ఈ విషయం అర్ధమవుతుంది.
అజయ్ సింగ్ తిరిగి స్పైస్ జెట్ పగ్గాలు చేపట్టడం, ఏయిర్
ఇండియా కి కొత్త సియిఓ ని నియమించడం, జెట్ ఏయిర్ వేస్ లో ఇతిహాద్ వాటా కొనుగోళ్ళు
, ఇండిగో మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించడం, విస్తార మరియు ఏయిర్ ఏసియా సంస్థల
ప్రవేశం, మోడి ప్రభుత్వ కొత్త విమానయన రంగ విధానాలు, క్రమంగా పెరుగుతోన్న విమాన ప్రయాణీకుల
సంఖ్య, చిన్న నగరాలు మరియు పట్టణాలకు విస్తరిస్తున్న విమాన సర్వీసులు , ఏయిర్ కోస్తా
వంటి ప్రాంతీయ విమాన సంస్థల ఆవిర్భావం ఇవన్నీ ఎన్నో శుభ పరిణామాలు. స్లీపర్ రైల్
టికెట్ ధరకే సామన్యుడి విమాన ప్రయాణం త్వరలో సాధ్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. సిద్దంగా
ఉండండి!
No comments:
Post a Comment