Saturday, July 12, 2014

బాబు, మోడి లు దృష్టి పెట్టాల్సిన 10 అంశాలు




  1. ధనికులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం కోసం బారులు తీరేలా చేయాలి. అత్యుత్తమ వైద్యం సామాన్యుడికి అందించేందుకు  ప్రభుత్వాసుపత్రుల ప్రమాణాలు పెంచాలి. చౌక ధరల్లో ఔషద మందులు (మెడిసిన్స్) లభించేలా ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ ఔషద దుకాణాలు ఏర్పాటు చేయాలి. 
  2. ప్రభుత్వ పాఠశాలలు (స్కూల్స్),కళాశాలల (కాలేజెస్) విద్యార్ధులు పోటి పరీక్షల్లో ప్రధమ స్థానంలో నిలవాలి. లక్షలు పోసి చదువు కొనే దుస్థితిలో మార్పు తేవాలి.   ఇ-భోదన జరగాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి రాణించివారికి ప్రోత్సాహకాలివ్వాలి.
  3. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో , మొదటి 10 నిమిషాల్లో స్పందించి బాధితులను ఆదుకొని వారి ప్రాణాలు నిలిపే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతి మండలానికొకటి చొప్పున 108 వాహనాన్ని, అగ్ని మాపక వాహనాన్ని (ఫైర్ ఇంజన్) సమకూర్చాలి.
  4. అన్ని వృత్తుల్లోకెల్లా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. రైతన్నలు వారు పండించిన పంటకు మద్దతు ధర సంవత్సరమంతా లభించేలా చర్యలు తీసుకోవాలి. దళారుల నివారణకు కఠిన శిక్షలు అమలు చేయాలి. గోదాములు (గోడౌన్) నిర్మించి వర్షం బారి నుండి వ్యవసాయోత్పత్తుల నిల్వలను రక్షించాలి.
  5. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో , విద్యా సంస్థల్లో , ప్రభుత్వాధీనంలోని ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించేలా ఆదేశాలివ్వాలి. తద్వారా భూగర్భ జలవనరులను భావి తరాల కోసం పరిరక్షించాలి.
  6. పాలనలో అవినీతి అంతమొందించాలి. నిఘా కెమెరాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు , పరిపాలన వ్యవహారాలు అంతర్జాలం ద్వారా సాగాలి.  ఐడియా బ్యాంకు ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొల్పి ఉత్తమ సూచనలు , సలహాలిచ్హే ప్రభుత్వోద్యోగులకు తగిన ప్రోత్సహాకాలు ఇవ్వాలి.
  7. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్థాపించి యువతని పరిశ్రమల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దాలి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవి సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా రాయితీలు , ప్రాధాన్యత ఇవ్వాలి.
  8. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. మహిళల రక్షణకై ఒక టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించాలి. మహిళలపై తెగబడే వారిని కఠినంగా శిక్షించాలి.
  9. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేయాలి. ఉగ్రవాద దాడులు , అల్లర్లు జరగకుండా ఇంటెలిజన్స్ , రా వంటి సంస్థలను పటిష్ట పరచాలి.ఎన్.యస్.జి, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాల సిబ్బంది అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా కార్యాచరణ రూపొందించాలి.
  10. నిత్యావసరాల ధరలకు కళ్ళెం వేయాలి. అక్రమంగా గోదాముల్లో నిత్యావసరాలను ఉంచి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరగడానికి కారణమయ్యే వారు ఎంతటి వారైనా కటకటాలు లెక్కించేలా చేయాలి.  

India in Modi Rule 2014-24

Translate