Saturday, July 27, 2019

ఆంధ్ర కొత్త సి.ఎం ఈ విషయంలో ఎందుకు తొందరపడుతున్నారో ?

              ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తెలంగాణ తో కలిసి గోదావరి జలాల వినియోగం పేరుతో మరో చారిత్రాత్మక తప్పిదం చేయబోతుందా అంటే ప్రస్తుతానికి అవుననే అభిప్రాయం ఆంధ్ర ప్రజల్లో నెలకొని ఉంది.

              రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పైన హక్కుతో పాటు ఎన్నో ఆస్తులు కోల్పోయారు ఆంధ్రా ప్రజలు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అమరావతి పైన విషం కక్కుతుంది. హైదరాబాద్ ని తలదన్నే రాజధాని నవ్యాంధ్ర ప్రదేశ్ లో రూపుదిద్దుకోబోతుందనే ఆశలపైన కొత్త ప్రభుత్వం నీళ్ళు చల్లింది.

              ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ల పైన దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన ప్రభుత్వం తెలంగాణ తో నీటి జలాల వినియోగం లో తొందర పడుతుందనేది సగటు ఆంధ్రుడి ఆవేదన.

              నీరే జీవితం, నీరే భవిష్యత్ తరాలకు ఆధారం. చెన్నై , బెంగళూరు ల లో నీటి కష్టాలు, కర్నాటక-తమిళనాడు  మద్య వివాదాలు తెలిసిందే. నిపుణుల కమిటీ తో చర్చించి, ఎగువన ఉన్న తెలంగాణ పైన నీటి కోసం ఆధారపడని విధంగా , తెలంగాణ తరపున వచ్చే ప్రతిపాదన ని గుడ్డిగా ఆమోదించకుండా పూర్తి ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ భుభాగం గుండా వెళ్ళే విధంగా తక్కువ ఖర్చుతో కూడినదైతేనే ఆమోదించాలి. పయ్యావుల కేశవ్ మరియు చంద్రబాబు మాటల్లో వినండి కొత్త ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక జరిగే అనర్దాలు.  


India in Modi Rule 2014-24

Translate