Sunday, March 13, 2011

స్వరాష్ట్రంలో తెలుగుకి స్వర్ణయుగం ఎప్పుడు?

        ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంఖ్య పది కోట్ల పై చిలుకే. పది కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష త్వరలో అంతర్ధానమవబోతుందా?  అవుననే అంటున్నాయి యునెస్కో వర్గాలు. వారి అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 30 శాతం మంది పిల్లలు తమ మాతృ భాషకి దూరమైతే ఆ భాష అవసాన దశలో ఉన్నట్లే. ఈ కోవలో మన తెలుగు భాష కూడా చేరిందనే విషయం తెలుగు భాషాభిమానులకు సంభ్రమాశ్చర్యాలకు  గురిచేసే విషయమే. ప్రస్తుత తెలుగు భాషా దుస్థితి కి మన పరిపాలకులే కారణం. ఇప్పటికైనా  మన ప్రభుత్వం మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలి.

మన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు:

1. తెలుగు భాషాభివృద్ధి కోసం యుద్ధప్రాతిపదికన మాతృభాషాభివృద్ధి శాఖ ఏర్పాటుచేయాలి.
2. తెలుగు రాష్ట్రంలో తెలుగులో పరిపాలన సాగాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో నియమ నిబంధనలు, ఉత్తర్వులు తెలుగులో వెలువడాలి. రోజువారి  పరిపాలన కార్యకలాపాల కోసం ఉపయోగించే సాఫ్ట్ వేర్లను తెలుగులో వృద్ధి చేసి వాటిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.  ఈ బాధ్యత మాతృభాషా శాఖ కి అప్పగించాలి.
3. 1 నుండి 10 వ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ లోని  ప్రతి పాఠశాల విద్యార్ధికి అన్ని మాధ్యమాల్లో  తెలుగు సబ్జెక్ట్ ని తప్పనిసరిచేయాలి. తమిళనాడు తరహా ద్విభాషా విధానాన్ని 2013-14 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలి.
4. తెలుగు మాధ్యమంలో పీ.జి. చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ను కల్పించాలి.
5. అంధ్ర ప్రదేశ్ లోని అన్ని వ్యాపార  సముదాయాల పేర్లు తెలుగు లో ఉండాలని చట్టం ఉన్నప్పటికీ  ఆ నియమాలు పాటించని వారి నుండి జరిమానా వసూలు చేయాలి .
6. నిర్మాతలు తమ సినిమా పేర్లని తెలుగులో పెట్టినట్లైతే వినోదపు పన్నులో రాయితీ కల్పించాలి.
7. తెలుగు పద కోశాన్ని విస్తరించాలి. ప్రముఖ కవులు, రచయితలు మరియు విద్యావేత్తలతో ఒక కమిటీనేర్పాటు చేసి టెక్నాలజీతో అనుభంధమైన ఆంగ్ల పదాలకు సరిపడా సమానార్ధం వచ్చే విధంగా కొత్త తెలుగు పదాలను సృష్టించాలి. ( ఉదాహరణకు: మొబైల్- చరవాణి, ఎస్.ఎం.యస్- పొట్టి సందేశం, ఇంటర్నెట్- అంతర్జాలం). తెలుగుని మింగేసే పదాల అంతు చూడాలి.
8. తెలుగు అకాడమీకి అధిక నిధులిచ్చి ఉన్నత విద్యకు సంబంధించిన అనేక శాస్త్రాల పుస్తకాలను తెలుగులో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.
9. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకి ప్రాచీన హోదా ఇచ్చినప్పటికీ నిధులు విదల్చకుండా నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. మన ప్రభుత్వం తక్షణం స్పందించి  నిధులు రాబట్టుకోవాలి. ఈ విషయంలో తమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలి.
10. విద్యార్ధులు తెలుగులో మాట్లాడితే దండించే పాఠశాలల అనుమతిని వెంటనే రద్దు చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
11.తెలుగు ఆపరేటింగ్ సిస్టం ని ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యుటర్లలో ఇన్ స్టాల్ చేయాలి.

తల్లి తండ్రులారా! తెలుగు భాష కి దిక్సూచి మీరే!!
  • తల్లిదండ్రులు తమ పిల్లల సిలబస్ లో తెలుగు భాష తప్పనిసరిగా ఉండేలా చూడాలి. తెలుగు భోదించని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు మీ పిల్లలను దూరంగా ఉంచండి.  
  • మాతృభాషకి తమ పిల్లలు దూరమైతే తెలుగు సంస్కృతికి దూరమైనట్టే. కనుక మమ్మి, డాడి అని పిలిస్తే పొంగిపోకుండా అమ్మ, నాన్న,అత్తయ్య , మామయ్య మొదలగు పదాలు వాడడంలో ఉన్న మాధుర్యాన్ని మీ పిల్లలకు తెలియచెప్పండి.  జనవరి, ఫిబ్రవరి లాగ తెలుగులో కూడా చైత్ర, వైశాఖ మాసాలున్నయనే సంగతి మీరు చెప్తేనే తెలుస్తుంది.
  • మనం తెలుగువారం, తెలుగులోనే మాట్లాడుకుందాం. అది మన రాజధానైనా లేక మన రాష్ట్రంలోని మారుమూల పల్లెటూరైనా. ముఖ్యంగా మన రాజధానిలో తెలుగు మాట్లాడటానికి సిగ్గుపడేవారెందరో. 
  • సాధారణ సందర్భాలలో సంతకం చేయాల్సివచ్చినప్పుడు తెలుగులోనే సంతకం చేయండి. తెలుగు వార్తాపత్రికలు చదివే విధంగా తమ పిల్లలను ప్రోత్సహించండి.
  • నేడు పెద్ద శాఖల్లో పని చేసేవాళ్ళలో  ఎంతో మంది ఒకప్పుడు పెద్ద బాల శిక్ష చదివినవాళ్ళే కదా. తెలుగు భాష తమ పిల్లల భవిష్యత్ ఎదుగుదలకు ఆటంకం కానే కాదనే సంగతి గుర్తించండి. మాతృ భాషలో చదివిన విద్యార్ధి ఆలోచనా విధానం అన్య భాష ఆలోచనా విధానం కంటే ఎన్నో రెట్లు త్వరితంగా ఉంటుందని అనేక పరిశోధనలు తేల్చాయి.
మీడియా తీసుకోవాల్సిన చర్యలు:
  1. ఆధునిక తెలుగు భాష కు వార్తాపత్రికలు, టెలివిజన్ చానెల్స్ పెద్ద దిక్కు. మీడియా నిర్విరామ కృషి వల్లే తెలుగు భాష ఇంకా వెలుగులీనుతుందని చెప్పవచ్చు.
  2. ఐతే ఇటీవల కొన్ని టెలివిజన్ చానెల్స్ కార్యక్రమాల పేర్లను సైతం ఇంగ్లీష్ లో పెట్టడం వల్ల ఆయా కార్యక్రమాల అంతరార్ధం సామాన్యుడికి చేరట్లేదు . కార్యక్రమాల పేర్లు తెలుగులోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.



ONLINE లో తెలుగు కోసం

ఆన్ లైన్లో తెలుగులో రాయాలనుకునేవారి కోసం తెలుగు టైప్ రైటర్:

(TELUGU TRANSILITERATION TOOLS):



http://etelugu.org/typing-telugu
http://lekhini.org/
http://www.epalaka.com
http://www.quillpad.com/telugu/
http://www.yudit.org/
http://www.sirigina.com/telugulipi/
http://suryaguduru.googlepages.com/
http://www.uni-hamburg.de/Wiss/FB/10/IndienS/Kniprath/ElmarsIndic.htm
http://www.google.com/transliterate/Telugu


తెలుగులో బ్లాగు ప్రారంభించేందుకు ఉపయోగపడే వెబ్ సైట్లు.


TO CREATE TELUGU BLOG:


http://groups.google.com/group/Telugublog
http://etelugu.org/
http://koodali.org/
http://te.wikipedia.org
http://www.sodhana.blogspot.com/
http://blogs.sulekha.com/

తెలుగు పుస్తకాలు అమ్మే అంతర్జాల దుకాణం :
మీరు తెలుగు రచయిత ఐతే మీరు రచించిన పుస్తకాలను ఇంటర్నెట్ లో అమ్ముకోవచ్చు. ఎలా అంటే:
1. పుస్తకం కాపీ రైట్ హక్కులు మీవేనని హామి పత్రం.
2. పుస్తకం సాఫ్ట్ కాపీ  ని పి.డి.ఎఫ్ ఫార్మట్ లో ఈ కింద వెబ్ సైట్ వారి కి మెయిల్ చేయండీ.
ఒక రకంగా చెప్పాలంటే ఆన్ లైన్ లో తెలుగు పుస్తకాలు అమ్మే దుకాణం అన్నట్లు. దీనివల్ల 
లాభాలేమిటో తెలుసా ? 
1. ప్రతిగా మీకు రాయల్టీ చెల్లిస్తారు.
2. మీ పుస్తకం ఇంటర్నెట్ లో ప్రతి తెలుగు పాఠకుడికి 24 గంటలూ, 365 రోజులు అందుబాటులో  ఉంటుంది.
www.kinige.com
mail id: support@kinige.com

తెలుగు ఆపరేటింగ్ సిస్టం ని మీ కంప్యుటర్లలో ఇన్ స్టాల్ చేయాలనుకుంటున్నారా? 
www.swecha.org చూడండి.


Telugu Linux Operating System Live CD cost: 100 Rs.

Contact Details:
Ramesh Bh. (manager),
Mobile: +91-9490098014,
Landline: 040-20041263
Swecha
Sy. No. 91,  Beside AALIM,
Greenlands colony, Gachibowli 'X'Roads,
Sherilingampally, Rangareddy Dt.,
Hyderabad – 500032


గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఆండ్రాయిడ్ తెలుగు అప్లికేషన్లు:


 1. తెలుగు మాట
 2. పాణిని కీ పాడ్ తెలుగు.
 3. లిపికార్ తెలుగు కీ బోర్డ్.
 4. ఎనీ సాఫ్ట్ కీ బొర్డ్.

మీరు తెలుగు బ్లాగరా? ఐతే మీ తెలుగు బ్లాగ్ ని తెలుగు బ్లాగ్ ల నెట్ వర్క్ కి అనుసంధానించండి.  ప్రతి తెలుగు బ్లాగర్ రాసే అన్ని విషయాలను ఒకే చోట చదవండి. 

http://www.jalleda.com/
http://www.maalika.org/
http://haaram.com/Default.aspx?ln=te
http://koodali.org
http://www.sankalini.org/
http://www.telugubloggers.com/


అంతర్జాలంలో తెలుగు దిన పత్రికలు:

www.andhrajyothy.com
www.eenadu.net
www.sakshi.com
www.suryaa.com
www.vaartha.com
www.prajasakti.com
www.andhrabhoomi.net
www.visalaandhra.com



తెలుగు విజ్ఞాన సర్వస్వం - వికీ పీడియా తెలుగు:


www.te.wikipedia.org



 తెలుగు 

కీబోర్డ్…



ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శన మేళా లో సురవర సంస్థ రూపొందించిన కీ బోర్డ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. మన ప్రభుత్వానికి నిజంగా తెలుగు పైన చిత్త శుద్ధి ఉంటే ఇలాంటి తెలుగు కీ బోర్డ్ లను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాడేలా తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ మేళా లో కీ బోర్డ్ ప్రత్యేక ధర : 900 


www.suravara.com




  • కంప్యూటర్లు, ల్యాప్టాప్ల పై పని చేస్తుంది.
  • మైక్రోసాఫ్ట్ విండోస్ 7, ఎక్స్పీ, విస్టా, లినక్స్, అను ఫాంట్స్ పై పని చేస్తుంది.
  • ఇంగ్లిష్, తెలుగు రెండూ సపోర్ట్ చేస్తుంది.
  • ఇన్స్క్రిప్ట్ స్టాండర్డ్ నిమిషాల్లో నేర్పిస్తుంది.
  • యూనికోడ్ తెలుగును మీ మునివేళ్ళపై ఉంచుతుంది.
  • మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపిస్తుంది.

ఈ కీబోర్డ్ తో మీరు…



  • అతిసులభంగా తెలుగులో టైప్ చేయండి
  • తెలుగులో ఈ-మెయిల్స్ పంపించండి
  • తెలుగులో చాటింగ్ చేయండి
  • తెలుగులో కథలు, నవలలు రాయండి
  • తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయండి
  • తెలుగులో వెబ్సైట్లు నడపండి.
  • ఆంగ్ల భాషకు లభించే అన్ని సౌలభ్యాలు తెలుగుకు కూడా దగ్గర చేయండి






India in Modi Rule 2014-24

Translate