ఒక తెలుగు సినిమా 100 కోట్ల వసూళ్ళ స్థాయిని అందుకోవడం నిజంగా అరుదుగా జరుగుతుంది. కానీ తెలుగు సినిమా , మన భారతీయ సినిమా చరిత్రలో వసూళ్ళ సునామీ సృష్టించిన తొలి 5 సినిమాల్లో నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తొలి 3 వారాల్లోనే 500 కోట్లు వసూలు చేసి బాలివుడ్ తారల ఒళ్ళు జలదరింపజేసి తెలుగు సినిమా ఖ్యాతిని, భారతావని తో పాటు ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన సినిమా "బాహుబలి".
హిందీ
సినిమా చరిత్రలో ఒక డబ్బింగ్ చిత్రం 100 కోట్ల స్థాయిని అందుకోవడం బాహుబలితోనే మొదలైంది.
తెలుగు సినిమాని ఇక పైన బాహుబలి కి ముందు బాహుబలి కి తరువాత అని చెప్పవచ్చు. బాహుబలి
ప్రభంజనం తరువాత బాలివుడ్ నిర్మాతలు, దర్శకులు దక్షిణాది మార్కెట్ ని, సినిమాలని
విస్మరించబోరు. తమ చిత్రాలన్నింటిని దక్షిణాది భాషల్లో తప్పక విడుదల చేస్తారు. అలానే
దక్షిణాది నిర్మాతలు, హీరోలు, దర్శకులు తమ చిత్రాలను హిందీలోకి డబ్ చేసి విడుదల చేస్తారు.
బాహుబలి విజయం తెలుగు
వారందరికి ఎంతో గర్వకారణం. తెలుగు సినిమాని ఎంతగానో ప్రేమించేవారందరికి రాజమౌళి ఇచ్చిన
బహుమతి. ఇది మా సినిమా అని ప్రతి తెలుగు వాడు తొడగొట్టి, తల ఎత్తుకు తిరిగేలా చేసిన
బాహుబలి బృందానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
It's not Telugu movie its Indian movie. It's trend setter in indian film industry. It is a well produstisation. Now we can have Bahubali series like Lord of Rings.
ReplyDelete