Saturday, September 5, 2009

గో పూజ,గో సేవ,గో రక్షణ ప్రతి హిందువు కర్తవ్యం




  • గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు.
  • ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక పూట భోజనాన్ని ఇస్తుందట. 
  • భూ మాత గో రూపంలో నే దర్శనమిస్తుందని శ్రీ మద్భాగవతం లో ఉంది. 
  • గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు కలరు. అందుకే ఆవును ముందు ప్రవేశ పెట్టి, ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.  
  • గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. 
  • గో పూజ,గోరక్షణ,గోదానం,గో వధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం.  
  • తల్లి పాల వలె సులభంగా జీర్ణం అయ్యే శక్తి ఆవు పాలల్లో ఉంది. ఆవు పాలు సంపూర్ణాహారము. శిశువులకు, వృద్ధులకు చాల శ్రేష్ఠం. క్రొవ్వు ఉండదు. ఆవు పాలలో ప్రోటీనులు , కార్బోహైడ్రేట్లు , ఖనిజాలు, విటమినులు , మెగ్నీషియం , క్లోరిన్ మొదలగు లోహాలు ఉన్నాయి.  
  • నీరు త్రాగుతున్న గోవును, పాలు తాగుతున్న దూడను వారించకూడదు(అడ్డు పడకూడదు).

  • గోవు తిరుగాడు మన ముంగిళ్ళు,
  • దేవాలయాలను తలపించు గుళ్ళు,గోవులు కదలాడే దేవుళ్ళు...  

  • గోవులను వధించకుండా చూడాలి. గోవులు జీవించి ఉండాలి. ఆయుర్వేదం లో విష పదార్ధాలను గో మూత్రంతో శుద్ధి చేస్తారు. 
  • భోపాల్ విష వాయువు వచ్చిన సమయం లో ఒక ఇంట్లో విష వాయువులు ఎమీ చేయలేకపోయాయట. కారణం ఎమిటో తెలుసా..? ఆ ఇంట్లో ఆవు పేడతో యజ్ఞం చేశారు కాబట్టి. 
  • దేశం మొత్తమ్మీద 6.27 లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామంలో 50 రైతు కుటుంబాల్లో  ఒక్కొక్క కుటుంబానికి 2 ఎద్దులు, 4 పాడి ఆవులు ఉంటే వాటి ద్వార లభించే పేడ దేశం మొత్తానికి కావాల్సిన పెట్రోల్, యల్.పి.జి, కిరోసీన్ , యల్.ఎన్.జి అవసరాలను తీరుస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుపడుతుంది. 
  • గో మూత్రం ఒక లీటర్ 120 రూపాయలు. పేడ కిలో 15 రూపాయలు అమ్ముతుంది మహరాష్ట్రలోని వెడప్ కాషా అనే సంస్థ. ఈ సంస్థ కేవలం 3 గోవుల ద్వారా 60000 విలువ చేసే సేంద్రియ ఎరువులను , 250000 విలువ చేసే అగరుబత్తులను తయారు చేసి సంచలనం సృష్టించింది. 
  • గో మూత్రం వల్ల భూ సారం 20 శాతం అభివృద్ధి చెందుతుంది. ఒక గ్రాము గోమయంలో 300 కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. అవి భూసారాన్ని పెంచుతాయి.  
  • ఆవుకి  నమస్కరిస్తే ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది.  మంగళం కొరే మానవుడు ఆవులకు ఎల్లప్పుడూ నమస్కరించడం అవసరం. ఆవు పృష్టానికి నమస్కరించడం శ్రేయోదాయకమని స్రీ సూక్తం లో చెప్పబడింది.  
  • గోవు భారత ఆర్ధిక వ్యవస్థ లో కీలకము. భారతీయులు వ్యవసాయం మీద ఆధార పడితే , ఆ వ్యవసాయ భారాన్ని తమ భుజాలపైన మోస్తున్నవి ఎద్దులు. ఆలాంటి ఎడ్లనించ్చేది గోవులే. అందుకే ఆవు మనకు అమ్మ. ఎద్దు మనకు అన్న. 
  • గో బ్రాహ్మణ హింస జరిగే చోట అబద్దమాడవలసి వచ్చి అబద్దమాడినా దోషం లేదని వ్యాస భారతం చెప్పింది. 
  • ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది.  గో దానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని  శాస్రంలో చెప్పబడింది.    
  • ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రొజున గో పద్మ వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది.  
  • ఎండ వల్ల, వడ గాడ్పులప్పుడు , చలి గాలులు వీస్తున్నప్పుడు , వర్షం వచ్చినప్పుదు ముందుగా నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు గోవును రక్షించు. 
  • గో పోషణ కొరకు పరుల గడ్డి వామిలోంచి గడ్డి తీసుకొని ఆవుకు వేస్తే అది దొంగతనం కాదు. 
  • జాతి పిత గాంధీజి నాకు స్వాతంత్ర్యం కంటే గో రక్షణే ప్రధానమన్నారు.  
  • భూమాతకు ఆభరణం గోమాత,
  • ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది.
  • తరతరాల భారతీయ భూతదయ పరంపరకు సజీవ సాక్ష్యం గోమాత
  • గోసేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్య ఫలం
  • గోసంపద ఉన్నచో అది అర్ధ బలం,
  • గోమూత్రం పుణ్య జలం.
  • గోక్షీరం పసిపాపలకు తల్లి పాల బలం.
  • గోవును పూజించిన చాలు నశించును మన పాపాలు సకలం.
  • గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు. 
  • పల్లెలలో గో సంతతి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే పల్లే ప్రజలు పల్లెల్ను విడిచిపోతారు.
  •      

             గోపాలుడు పుట్టిన భరతదేశం లో గోవులకు రక్ష లేకుండా పోయింది. గో హత్యలు పెరిగిపోతున్నాయి. గోహత్యలు నిషేదించాలి. గోహత్యలు చేసిన వారికి కఠిన శిక్షలు వేయాలి.దీనికోసం చట్టం తెచ్చేవరకు మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి.

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate