1956 నుండి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న హైదరాబాద్ అర్ధికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి దేశంలో అగ్రగామి నగరంగా ఎదిగింది.
విభజన తో ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ పై సర్వ హక్కుల్ని కోల్పోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించాల్సి వచ్చింది.
ఆనాడు ఆంధ్రా ప్రజల వేదన, వాదన వినే నాధులే కరువయ్యారు. కలిసి కూర్చోపెట్టి చర్చించకుండా ఎటువంటి పంపకాలు సక్రమంగా జరుపకుండా హడావుడిగా, ఎటువంటి హేతు బద్ధత లేకుండా విభజన పూర్తి చేసారు. శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక పక్కనపెట్టి ఓట్లు, సీట్లు ప్రాతిపదికన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చారు. ఆ తరువాత ఆంధ్ర ప్రజలు తమ మాట వినని కాంగ్రెస్ ని కనుమరుగు చేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఆరోజు ప్రముఖంగా ఇచ్చిన హామీలు 2. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా. రెండు పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా. ఇవి ఆంధ్రా హక్కులు. నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్య సభ లో అంధ్రా కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇప్పటికి అది కలగానే మిగిలింది. రెండో ముఖ్య హామి ఐన పోలవరానికి జాతీయ హోదా ప్రకటించారు కానీ, నిధులు మాత్రం విదల్చట్లేదు, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పట్లేదు.
ఆంధ్రా ఎం.పీ లు పార్టీలకతీతంగా ఒక్కటవ్వండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజల గురించి ఆలోచించండి. ఆంధ్రా హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడండి. ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో, ఇంకా ఎంత కాలం నానుస్తారో తేల్చేవరకు ప్రస్తుత సమావేశాలు జరుగనీయొద్దు. మీ వెనక 5 కోట్ల అంధ్రా ప్రజలున్నారు. ఇక పోరు బాట మొదలు పెట్టండి.
No comments:
Post a Comment