Saturday, July 28, 2012

హిందు ధర్మ పరిరక్షణ కై నేను సైతం...





ఈ ప్రపంచం లోని సర్వ ప్రాణులను సమ దృష్టి తో చూసేది, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించేది, శాంతి సామరస్యాలను పెంపొందించేది మన హిందు ధర్మం. అట్టి హిందు ధర్మం 21 వ శతాబ్దం లో ఎదుర్కొంటున్న సవాళ్ళను , ధర్మ పరి రక్షణకై తీసుకోవాల్సిన చర్యలను చర్చింటానికి భక్తి ధార్మిక సమ్మేళనం పేరిట ఒక వేదిక ఎర్పాటు కావడం ఒక శుభ పరిణామం.

నేటి తరానికి, విద్యార్ధులకు అధ్యాత్మికత అవసరాన్ని , దేవాలయాల ప్రాముఖ్యతని , మన సంస్కృతి  సంప్రదాయాలను తెలియజెప్పడం తల్లిదండ్రులు తమ బాధ్యతగా తీసుకోవాలి. అమ్మ ఒడే పిల్లవాడి భవిష్యత్ ని తీర్చిదిద్దుతుంది. కుటుంబ వ్యవస్థ  అవసరాన్ని , గురువులను గౌరవించే విధానాన్ని, మన హిందు ధర్మ ఆవశ్యకతని  పెద్దలు నేటి పిల్లలకు నేర్పించాలి. హిందు ధర్మ పరిరక్షణ కై ప్రతి ఒక్కరు తమ వంతు గా కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
గత నెలలో రచన సంస్థల ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత నరేంద్ర చౌదరి చొరవతో ఏర్పాటైన భక్తి ధార్మిక సమ్మేళనం  హిందు ధర్మ పరిరక్షణకై అవతరించిన  వేదికగా, తొలి అడుగులు వేసింది. తనతో పాటుగా రచనా సంస్థ నిర్వహించే యన్ టి.వి , వనిత టి.వి, ఐ న్యూస్ చానెళ్ళు హిందు ధర్మ పరి రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తాయని ప్రకటించారు. శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద సరస్వతి లాగ ఇతర పీఠాధిపతులు చురుకుగా హిందు ధర్మ పరి రక్షణలో పాల్గొనాలి. పరిపూర్ణానంద  ఆధ్వర్యంలో ఎంతో మంది స్వధర్మం స్వీకరించడం హర్షించదగిన పరిణామం.   ఇలాంటి సంస్థలు, వేదికలు ఎన్నో ఊరురా, వాడ వాడల వెలవాల్సిన సమయమిదే. మన దేవాలయాలే వేదికగా, భక్త సంఘాలతో కలిసి మరిన్ని సంస్థలు హిందు ధర్మ పరి రక్షణ కై ఒక్కటవ్వాలి.



భక్తి ధార్మిక సమ్మేళనం లో చర్చించిన కొన్ని అంశాలు:
1. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాల పునరుద్ధరణ.
2. దేవాదాయ శాఖ ద్వారా హిందు ధర్మ పరి రక్షణకి, ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలు.
3. పీఠాధిపతులు , ప్రముఖ అధ్యాత్మికవేత్తలు, పండితులతో కూడిన హిందు సమాజ ఐక్య వేదిక స్థాపించడం.
4. హిందు సమాజం పై నోరు పారేసుకుంటు , అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఐక్య వేదిక ద్వారా తక్ష్ణం స్పందించి చర్యలు తీసుకోవడం.
5. అతి వేగంగా జరుగుతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం. హిందు దేవాలయాల పరిసరాల్లో, పుణ్య క్షేత్రాల్లో జరుగుతున్న అన్య మత ప్రచారానికి అడ్డు కట్ట వేయడం.
6. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారి నైజాన్ని హిందు సమాజానికి తెలియజెప్పడం.
7. నేటి యువత , విద్యార్ధులలో భక్తి భావాలు పెంపొందించటానికి తీసుకోవాల్సిన చర్యలు.
8. రామాయణ,భారతాలు, వేదాలు , అనేక ధర్మ గ్రంధాల సారాన్ని సమాన్యుది చెంతకు చేర్చడానికి అనుసరించవలసిన మార్గాలు.
9. వివిధ కారణాల వల్ల హిందువుగా పుట్టినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ధర్మాలను అనుసరిస్తున్న వారిని అమ్మ ఒడికి( స్వధర్మానికి)తీసుకురావడానికి కలిసి కట్టుగా కృషి చేయడం. 

10. పండుగలు, ఉత్సవాలు, భజనాలు, సత్సంగాలు ద్వారా హిందు సమాజాన్ని ఐక్యం చేయడం.



హిందు ధర్మ పరిరక్షణ కోసం పాటుబడుతున్న కొన్ని సంస్థలు :





   

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate