Friday, July 27, 2012

తెలుగు సినిమా పై బాలీవుడ్ కన్ను


 తెలుగు లో విజయం సాధించిన సినిమాని హిందీ లో నిర్మించడం. అక్కడ హిట్ కొట్టడం. ఇదే ఇప్పుడు హిందీ చిత్ర సినిమా లో కనిపిస్తున్న కొత్త పోకడ. బాలీవుడ్ హీరో ల రాత మారుస్తున్నవి మన తెలుగు సినిమాలే అంటే అతిశయోక్తి కాదేమో..

             గడచిన 4 సంవత్సరాల కాలాన్ని పరిశీలించినట్లైతే కనుక దక్షిణాది చిత్రాల ఆధారంగా హిందీ లో నిర్మించిన అనేక సినిమాలు అక్కడి ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయని చెప్పొచ్చు.  వీటిలో తెలుగు సినిమాలూ ముఖ్య భూమికని పోషిస్తున్నాయి. నిర్మాత కి కాసుల పంట పండాలన్నా, హీరోలు అపజయాలని మరచి విజయాల బాట పట్టాలన్నా ఇప్పుడు తెలుగు సినిమాలే దిక్కు.

            ఆ మధ్య సల్మాన్ ఖాన్ తెలుగు సినిమా "పోకిరి"  కి రీమేక్ ఐన 'వాంటెడ్'  చిత్రంలో నటించి తన 2 వ ఇన్నింగ్స్ ని  విజయాలతో ఆరంభించాడు. వరుస వైఫల్యాలతో సతమవుతున్న అక్షయ్ కుమార్ ఇటీవల 'రౌడీ రాథోడ్' చిత్రంతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. రౌడీ రాథోడ్ చిత్రానికి మాతృక మన తెలుగు సినిమా "విక్రమార్కుడు". మరో హీరో అజయ్ దేవ్గణ్ 'సన్ ఆఫ్ సర్ధాఋ చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చెయబోతున్నాడు. సన్ ఆఫ్ సర్ధార్ సినిమా "మర్యాద రామన్న"  ఆధారంగానే నిర్మితమైంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ'రెడీ' మన తెలుగు 'రెడీ' కి రీమేక్. త్వరలో హిందీ కిక్ ని ప్రారంభించబోతున్నాడు.

           త్వరలో మరిన్ని తెలుగు హిట్ సినిమాలు హిందీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. అరుంధతి , ఢీ, అలా మొదలైంది, మగధీర , సీమ టపాకాయ , ఠాగూర్ , ఇంద్ర వాటిలో కొన్ని. ఇంకా ఎన్నో తెలుగు హిట్ చిత్రాలపై హిందీ నిర్మాతలు కన్నేశారు.

          హీరోయిజం , తగినంత కామెడి , కధా కధనాలు , అత్యున్నత సాంకేతిక విలువలు వీటికి తోడు తెలుగు ప్రేక్షకుడి అభిరుచులు , బాలీవుడ్ సినీ ప్రియుల అభిరుచులకు దగ్గరగా ఉండటం మన కధలు అక్కడి వారిని అలరించడానికి  కారణాలు. ఈ ధోరణి తెలుగు నిర్మాతలకు శుభ పరిణామమే.  
                 

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate