Friday, December 24, 2010

మన దేశ రక్షణ గాలిలో దీపం అనేందుకు సాక్ష్యాలివిగో..

భారత్ పైన ఉగ్రవాది దాడి జరిగితే --> అన్ని దాడులను మేము ఆపలేము అని చేతులెత్తేస్తారు.
అవినీతి కుంభకోణాలు బయటఫడితే   --> బాధ్యులని కఠినంగా శిక్షిస్తాం అంటారు.
ఎవరికైనా ఉరిశిక్ష విధిస్తే  --> ఎప్పటికీ అమలుచేస్తారో చెప్పలేం అని సమాధానమిస్తారు.
సి.బి.ఐ, ఎన్.ఐ.ఎ, ఎ.టి.యస్, ఆక్టోపస్ ,ఇంటెలిజెన్స్ --> ఇవి అన్ని జనాల్ని విచారణ పేరుతో మభ్య పెట్టడానికే తప్ప ఒరిగేదేం లేదు. 

  ఈ నిర్లక్ష్యం , చేతకానితనం, గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం, ఓటు బ్యాంకు రాజకీయాలే మళ్ళీ జులై13 న మన ఆర్ధిక రాజధాని ముంబాయి ని రక్తసిక్తం చేసింది. భారతీయులు విసిగిపోయారు...ఇక సహనం పాటించలేరు. నాయకులు గుర్తుంచుకోండి. సామాన్యుడి ఓటుకి బలవుతారా ? దేశంలో ఉగ్రవాద భూతాన్ని అంతం చేస్తారా? 




  • భారత వాణిజ్య రాజధాని ముంబయి నగరంపైన పాకిస్థాన్ పరోక్ష సహకారంతో ముష్కరులు దాడి చేసి 2 సంవత్సరాలు గడిచాయి. ఉగ్రవాది కసబ్ ని విచారించి కోర్టు విధించిన ఉరి శిక్షని ఎప్పుడు అమలు చేస్తారు?
  • 2001 లో సాక్షాత్తు భారత పార్లమెంటుపై తుపాకి గుండ్ల వర్షం కురిపించిన అఫ్జల్ గురు ని ఉరితీయటానికి తొమ్మిదేళ్ళనుండి  మంచి ముహుర్తం కుదర్లేదా?
  • ఇలాంటి కరడుగట్టిన తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించటంలో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం, భారత్ లో ఎంతకు తెగించినా జైళ్ళలో దర్జాగా సకలభోగాలు అనుభవిస్తూ జీవించొచ్చని  ప్రపంచానికి సంకేతాలిస్తున్నట్లు కాదా? 
  • 7200 కి.మీ. భారత తీర రేఖ వెంబడి అత్యాధునిక పరిఙ్ఞానంతో మెరైన్ పోలిస్ వ్యవస్థని ఏర్పాటుచేసి గస్తీ ముమ్మరం చేస్తానని ముంబై దాడుల అనంతరం ప్రభుత్వం హామి ఇచ్చింది. ఇటివల ఆంధ్రప్రదేశ్ డి.జి.పి అరవిందరావు 900 కి.మి పైగా తీర ప్రాంతమున్న మన రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటుచేసింది కేవలం 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు మాత్రమేనని, అవి గస్తీ కి ఏమాత్రం సరిపోవని తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రమిచ్చిన హామీ నీటి మూటేనని, మరోసారి ముంబై తరహా దాడులు జరగకుండా అడ్డుకునే సత్తా తమ వద్ద లేదని చేతులెత్తేసినట్లు కాదా? 
  • దేశ సమగ్రతకు భంగం కలిగించేలా  కాశ్మీర్ పై ఇష్టమొచ్చినట్లు ప్రతి రోజు  వ్యాఖ్యలు చేస్తున్న గిలానీ, యాసిన్ మాలిక్, అరుంధతి రాయ్ మరియు ఒమర్ అబ్దుల్లా  వంటి వేర్పాటువాద నాయకులను తక్షణమే అరెస్ట్ చేయకుండా ఉపేక్షించడం మరింతమందిని ఆ దిశగా ప్రోత్సహించడంతో సమానం కాదా?  
  • అతి శీతల వాతావరణాన్ని తట్టుకొని అనుక్షణం దేశ రక్షణకై సరిహద్దు వద్ద పహార కాస్తూ మిలిటెంట్ల అంతు చూస్తున్న సైన్యం అధికారాలను కత్తిరించాలని కాశ్మీర్ వేర్పాటువాదులు కోరడం, ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని యోచించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలియని భారతీయుడు ఉండడేమో? 
  • కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తి కల్గిస్తున్న ఆర్టికల్370 ని వెంటనే రద్దు చేయాలని, అప్పుడే అక్కడి ప్రజల్లో వేర్పాటు భావాలు తొలిగి ఇతరప్రాంతల మాదిరి అభివృద్ధి జరుగుతుందని ఈ నెహ్రు  వారసులకు అర్ధమవకపోవడం శోచనీయమే కదా?
  • నక్సల్స్ ఏరివేత విషయంలో  పక్కా ప్రణాలిక లేకపోవడం, తద్వారా ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి ప్రత్యక్ష తార్కాణమే!
  • హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కాశీ లో తీవ్రవాదులు దుశ్చర్యకు  పాల్పడితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకొరికొకరు సహకరించుకోకుండా నిందలు వేసుకోవడం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టేనని  తెలియనిదెవరికి?
                         అంతే కదా! కుంభకోణాలకు, అవినీతికి అడ్డాగా మారిన కాంగ్రెస్ పార్టీ కి  దేశ రక్షణ పై దృష్టి సారించే సమయమెక్కడిది? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, దేశ జనాభాలో కేవలం 10 శాతం ఉన్న ముస్లిం ఓట్ల కోసం దేశ ప్రజల రక్షణని, 90 శాతం జనాభా కల్గిన హిందువుల మనోభావాలను తాకట్టుపెట్టింది. ఇకనైనా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. అప్పుడే దేశ రక్షణలో సరైన నిర్ణయాలు తీసుకోగల్గుతుంది.

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate