ఇటీవల కాంగ్రెస్ నాయకులైన రాహుల్, దిగ్విజయ్ సింగ్ మరియు చిదంబరం చేస్తున్న హిందు వ్యతిరేక వ్యాఖ్యలు 100 కోట్ల హిందువుల మనోభావాలను కోలుకోలేని దెబ్బతీశాయి. రాహుల్ ఐతే ఒక అడుగు ముందుకేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని దేశంలో ఉగ్రవాద కార్య కలాపాలకు కేంద్ర బిందువైన సిమి సంస్థతో పోల్చాడు. తరచూ హిందు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ హిందుస్థాన్ కి భావి ప్రధాని ఎలా అవగలడు?
ప్రస్తుత కుంభకోణాల్ని బట్టి చూస్తే 2014లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇట్టే అర్ధమవుతుంది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ బీహార్ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశాడు. రాహుల్ ప్రచార మహిమ వల్ల కాంగ్రెస్ గత ఎన్నికల్లో కంటే తక్కువ సీట్లే గెల్చుకుంది. పార్లమెంట్ ఎం.పి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఐన రాహుల్ సామాన్య ప్రజల కోసం చేసిందేమి లేదు. దేశంలో రైతులు తీసుకునే రుణాలకు అధిక శాతం వడ్డితో చక్ర వడ్డీ లు కట్టి అన్నదాతల ఒళ్ళు గుల్ల చేస్తూ వారిని ఆత్మ హత్యలకు ఉసిగొల్పుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలను వెనకేసుకొస్తున్నది ఇతగాడే అన్నది కఠోర సత్యం.
కాశ్మీర్లో శాంతి నెలకొల్పడంలో విఫలమవడమే కాక వేర్పాటువాదుల డిమాండ్లను స్వాగతిస్తున్న ఒమర్ అబ్దుల్లా ని సమర్ధించడం రాహుల్ చేస్తున్న మరో మహా తప్పిదం. దేశ రక్షణకై ప్రాణాలర్పించిన సైనికుల కోసం నిర్మిస్తున్న ఆదర్శ్ సొసైటి లో ప్లాట్లు పొందటానికి కాంగ్రెస్ ముఖ్య మంత్రులు ప్రదర్శించిన చేతి వాటం యావత్ దేశాన్నే నివ్వెరపరిచింది.
కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచి రాహుల్ ప్రధాని కావాలంటే అంధ్ర ప్రదేశ్ ఎం.పి. ల సంఖ్య చాలా కీలకం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావటానికి ఆంధ్ర ప్రదేశ్ నుండి గెలిచిన 29, 33 ఎం.పి. సీట్లే కారణం. ఆ విషయం అధిష్టానికి బాగా తెలుసు. ఎందుకంటే పార్టీని రెండు సార్లు గట్టెక్కించిన వై.యస్.రాజ శేఖర్ రెడ్డి ఇప్పుడు లేడు మరి. తెలంగాణ పై డిసెంబర్-9 తొందరపాటు ప్రకటన చేసి రాష్ట్రాన్ని మానసికంగా ప్రాంతాలవారిగా విడగొట్టింది. జగన్ కొత్త పార్టీ కాంగ్రెస్ వోట్లని చీల్చడమేకాక , ఆ పార్టీ ని నామరూపల్లేకుండా చేసే అవకాశం ఉంది. అంటే ఈసారి ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రమేనన్నమాట.
సముద్రంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ ని ఒడ్డునపడేసే విధంగా రాహుల్ ఆలోచించాలి కాని, ఇలా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడితే దేశ ప్రజలు రాబోయే ఎన్నికల్లో బాగానే బుద్ధి చెప్తారు.
No comments:
Post a Comment