Wednesday, November 17, 2010

పోలవరం(POLAVARAM) కట్టే మొనగాడెవరు?



ప్రతి యేటా వృధాగా గోదావరి నది గుండా సముద్రంలో కలుస్తున్న 3000 టి.ఎం.సి ల నీటిలో కొంత భాగాన్నైనా ఒడిసిపట్టి సేద్యానికి ఉపయోగించుకోవడానికి చేస్తున్న సత్ప్రయత్నమే పోలవరం.ఒక టి.ఎం.సి నీటితో 10000 వేల ఎకరాలు సాగు చేయొచ్చు. అంటే గోదావరి నుండి సముద్రంలో కలిసే నీరు ఎంత విలువైందో అర్ధం చేసుకోండి ఒక్కసారి. వర్షాధార వ్యవసాయాన్ని నమ్ముకోకుండా స్థిరంగా ఆహార ధాన్యాలు పండించి తద్వారా మన దేశానికి ఆహార భద్రత కల్పించేదే ఈ పోలవరం.


               క్రిష్ణా,గోదావరి నదుల అనుసంధానం ద్వారా గోదావరి మిగులు జలాలను క్రిష్ణా బేసిన్‌కి తరలించి సద్వినియోగం చేసుకోవటానికి ఉద్దేశించి నిర్మిస్తున్నదే మన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 960 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు,క్రిష్ణా ఎగువజలాలపైన ఆధారపడిన లక్షల ఎకరాల ఆయకట్టును సుస్థిరం చేస్తుంది. ఇందులో భాగంగా 84.7 టి.ఎం.సి ల నీటిని క్రిష్ణా బేసిన్‌కి తరలిస్తారు. విశాఖ మహానగర ప్రజల దాహార్తిని సైతం తీరుస్తుంది ఈ ప్రాజెక్ట్. ముంపు సమస్య లేకుండా ఏ ప్రాజెక్ట్ పూర్తి కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలు నిర్మించేముందు చాల ప్రాంతాలు ముంపునకు గురవుతాయేమొనని భయపడి నాటి నాయకులు వీటిని నిర్మించకుండా ఉండి ఉంటే నేటి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి.మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో నర్మద నది పై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఇలాంటి ఎన్నో అవాంతరాలు ఎదురొడ్డి నిలిచింది. చివరకు గుజరాత్ ని సస్యశామలం చేసింది. 


                          భవిష్యత్‌ని ముందుగానే అంచనా వేసే వాడు నిజమైన నాయకుడవుతాడు. నేటి ప్రాజెక్ట్లే రేపటి తరాలకి మనమిచ్చే బహుమతులు. ఒడిషా , చత్తీస్‌ఘర్ రాష్ట్రాలలో ముంపు బాధితులకి తగిన పరిహారం చెల్లించేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక రాష్ట్ర నాయకులంతా ఈ ప్రాజెక్ట్ విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.చైనా లోని త్రీగోర్జెస్ డ్యాం ని ఉదాహరణగా తీసుకుందాం. ఆ డ్యాం వల్ల 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడం వల్ల ఆ దేశం మొత్తం కలిపి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 10 శాతం పైగా విద్యుత్ ఈ ప్రాజెక్ట్ నుండి సమకూరింది. ప్రాజెక్ట్ కట్టిన 3 సంవత్సరాల వ్యవధిలోనే ప్రాజెక్ట్ కొరకు వెచ్చించిన డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగింది. మన దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే, వ్యవసాయాన్ని నమ్ముకున్న మన దేశంలోని 80 శాతం ప్రజలకు మేలు చేయాలన్నా  పోలవరం లాంటి ప్రాజెక్ట్ లను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   మహోన్నతమైన ఈ ప్రాజెక్ట్ కి ప్రాంతీయ రంగు పులిమి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకుండా వీలైనంత త్వరితంగా నిర్మించి జాతికి అంకితమివ్వాలనేది ప్రతి తెలుగు వాడి కోరిక. అప్పుడె మన అభినవ కాటన్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి స్వప్నం సాకారమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
           

             ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధం గా ఒప్పందం చేసుకున్నారో ఆ విధంగానే పోలవరం విషయంలో ఓడిశా , ఛత్తీస్ గర్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుని కిరణ్ సర్కారు ముందుకు వెళ్ళాలి. ప్రాణహిత ప్రాజెక్ట్ విషయంలో సీమ ఆంద్ర ప్రాంత  ప్రజా ప్రతినిధులు అడ్డు పడనప్పుడు తెలంగాణా ప్రజా ప్రతినిధులు పోలవరం విషయంలో ఎందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారో ఆలోచించుకోవాలి. పోలవరం తోనే మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు. 



           ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. విభజన తరువతా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోడి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్ర బాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. మోడి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు , చంద్ర బాబు ప్రభుత్వం చొరవ కలగలిసి జులై 11, 2014 న లోక్ సభలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సవరణలో పోలవరం కారణంగా ముంపుకు గురయ్యే తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో భాగమైన 7 మండలాలను ఆంధ్రలో కలిపి బిల్లుని ఆమోదింపజేసారు. మోడి సర్కారు రాబొయే 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది.  







The idea of the dam was first floated in the early 1940s but it remained a dream for the state government, an ambitious venture that stayed on election manifestos. So for years, the Godavari flowed almost unharnessed, emptying itself into the Bay of Bengal. It was only when Y S Rajasekhara Reddy took charge in the state that the Polavaram project was revived, as part of his Jalayagnam programme.

The 150-feet-high dam, called the Polavaram Indira Sagar Dam, will create a reservoir spreading over the three districts of West Godavari, East Godavari and Khammam. The tail-end of this reservoir is more than 150 km away, touching Bastar in Chhattisgarh and Malkangiri in Orissa. The dam will harness 170 thousand million cubic feet water (tmcft), through two canals that spread out as arms on either side: the right canal which will take 80 tmcft to river Krishna and the left canal, which will help irrigate 7.2 lakh acres in the north coastal Andhra districts and take 23 tmcft to Visakhapatnam, which faces a perennial water shortage. Work on the dam has not yet begun but the cranes are furiously at work on the left and right canals.
The dam, a Rs 11,000-crore project, will be an earth-cum-rock fill structure as the soil isn’t rocky enough for a concrete dam.

FACTS:

the Polavaram project aims to construct a dam on the mighty Godavari river and divert large quantities of water 174 kilometres through a link canal to the Krishna river. The dam is expected to produce 960 megawatts of power and irrigate 291,000 hectares of land in 15 of AP's 23 districts, according to a study done by India's Ministry of Environment and Forests (MoEF). The total land requirement for the project is 46,060 hectares. Authorities claim that the project will also provide drinking water to 2.5 million people in 540 villages on the project's route.

The Central Water Commission had approved the design based on initial estimates that the spillway (the structure that provides the controlled release of excess water) could withstand 36 lakh cusecs of flood discharge. It was later revised to 50 lakh cusecs

Relief  and Rehabilitation Package:
For nearly 60 years, Polavaram remained on paper, dogged by controversies of displacement. According to government estimates, the dam will submerge villages in the three Andhra districts of West Godavari, East Godavari and Khammam, in Bastar in Chhattisgarh and in Malkangiri, Orissa. Besides, nearly two lakh people will be displaced. This is an ambitious project that will solve the irrigation and drinking water problems over a large area.  Andhra Pradesh government ready to provide relief and rehabilitation package which is best in the country for displaced people.
The relief package includes Rs 1.20 lakh in cash, a two room-kitchen house and compensation for crops like cashewnut, coconut and palm for every person who will be displaced. Those who own land were given compensation in cash. The state government has given  assurances to the Centre, including the construction of a 60-km-long, 45-feet-high embankment to prevent flooding in neighbouring states.





Views of political leaders:

TDP’s Chandrababu Naidu, who has opposed the bifurcation of the state, says “large projects like Polavaram” are required to harness the true potential of the Godavari and help meet the irrigation and drinking water needs of people. PRP’s Chiranjeevi has gone one step ahead and met Congress president Sonia Gandhi, seeking a ‘national project status’ for the dam so that the Centre will bear much of the cost of the project. Chiranjeevi says Polavaram dam is “Andhra’s lifeline” because six coastal districts will benefit from it.

The Union Cabinet is now examining granting national status for Polavaram project., UPA chairperson Sonia Gandhi has assured the State that national status will be accorded to the Polavaram project across the Godavari as part of Jalayagnam programme

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate