Friday, October 27, 2017

బుల్ రన్ తో రికార్డ్ సృష్టించిన భారత స్టాక్ మార్కెట్ ! నెక్స్ట్ ఏంటి ?


 


       భారత స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 33100, నిఫ్టి 10300 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకు లకు 2 లక్షల కోట్ల మూల ధన పెట్టుబడి సమకూర్చాలని నిర్ణయించడంతో  బ్యాంకులు పరుగు తీశాయి. బి.యెస్.ఇ బ్యాంకెక్స్ 30% లాభాలతో దూసుకెళ్ళడం మార్కెట్లు సరికొత్త స్థాయిలకి చేరడానికి కారణమైంది.

         7 లక్షల కోట్లతో చేపట్టబోతున్న భారతమాల ప్రాజెక్ట్ దేశ మౌలిక రంగానికి కొత్త ఊపు ఇవ్వబోతుంది. రోడ్ నిర్మాణ సంస్థల వృద్ధి కి  భారత మాల ప్రాజెక్ట్ ఎన్నో అవకాశాలను కల్పించబోతుంది.


         దేశ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో, ఆ రంగంలోని చిన్న సంస్థలన్నిటిని పెద్ద సంస్థల గూటికి చేర్చి నాలుగు పెద్ద సంస్థలు మాత్రమే మిగిలేలా  చేసింది. టెలికాం రంగ కంపెనీలకు ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి.  


          ఐ.టి మరియు ఫార్మా రంగాలకు అమెరికా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి.  హెచ్ 1బి సమస్యలతో ఐ.టి కంపెనీలు, యు.యెస్.ఎఫ్.డి.ఎ అనుమతుల విషయంలో ఫార్మా కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.


          గడచిన సంవత్సరంలో గృహ రుణ మరియు సూక్ష్మ రుణ కంపెనీలు అత్యుత్తమ లాభాలను నమోదు చేశాయి. విమానయాన రంగం మంచి వృద్ది కనబరచడంతో ఆ రంగాలకి చెందిన కంపెనీలు మదుపరులకు మంచి లాభాలను పంచాయి.


          చైనా లో ముడి ఖనిజాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా అంతర్జాతీయంగా ముడి ఖనిజాలు అధిక ధరలు పలకడంతో దేశీయ కంపెనీలు మంచి వృద్ది నమోదు చేశాయి.


           జి.యెస్.టి, నోట్లరద్దుతో కారణంగా తొలుత ఇబ్బందిపడిన  ద్విచక్ర వాహనాలు, కార్ల కంపెనీలు 2017 ద్వితీయార్ధం లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో గత సంవత్సరంకంటే మెరుగైన పనితీరుని కనబర్చాయి.


           ఎఫ్.ఐ.ఐ ల ధాటికి ఒకప్పుడు పేక మేడలా కూలిపోయే స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డి.ఐ.ఐ), రిటైల్ మదుపరుల క్రమానుగత పెట్టుబడుల(సిప్)  అండతో కొత్త శిఖరాలను  అధిరోహించాయి.  ఇదే దూకుడు కొనసాగినట్లైతే మార్చ్,2018 నాటికి నిఫ్టి 12500 కి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత దేశ  వృద్ధి ఫలాలు మీకు అందాలంటే స్టాక్ మార్కెట్ లలో మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా సిప్ మొదలెట్టండి మరి.


           ఆల్ ది బెస్ట్ . 

         


   

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate