Friday, May 19, 2017

మోడి ప్రధాని గా 3 సంవత్సరాల్లో సాధించిన విజయాలు!దృష్టి సారించాల్సిన అంశాలు!





విజయాలు :

1.జనధన్/బ్యాంకు ఖాతా-ఆధార్-మొబైల్ నంబరు అనుసంధానం
2. స్వచ్చ్ భారత్
3. పెద్ద నోట్ల రద్దు
4. బొగ్గు గనుల పారదర్శక కేటాయింపు
5. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కి కొంతమేర ప్రత్యేక సాయం: పోలవరానికి నిధులు, రెవెన్యు లోటు పూరించడం , 24 గంటల విద్యుత్
   పధకం, కేంద్ర విద్యా సంస్థల కేటాయింపు
6. నిర్మాణ రంగ నియంత్రణా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ )
7. వస్తు సేవల పన్ను ( జి. యస్.టి )
9. రైల్వే పని తీరులో మెరుగుదల.
10. కరెంట్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి
11. జమ్ము కాశ్మీర్ తో మిగతా భారతావని కి మెరుగైన రవాణా సౌకర్యాలు.
12. ఈశాన్య భారత దేశ రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ద
13. ఉద్యోగ భవిష్య నిధి (ఈ. పి.ఎఫ్.ఓ లో) సంస్కరణలు. నగదు నిల్వల్లో 15 శాతం వరకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు.
14. పారదర్శక, నగదు రహిత భారత ఆర్ధిక వ్యవస్థ దిశగా అడుగులు.
15. నిత్యవసర సరకుల ధరల నియంత్రణ
16. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు బ్యాంకు నుండి తీసుకునే అప్పుపై రాయితీలు.
17. సామాన్యునికి విమాన ప్రయాణం సాకారం చేసేందుకు గంట ప్రయాణానికి 2500 గరిష్ట ధరతో విమాన ప్రయాణ టికెట్ .
18. పొరుగు దేశాలతో సత్సంబంధాలు.
19. వాస్తవాధిన రేఖ వెంబడి పాకిస్తాన్ వైపున ఉన్న ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడి.
20. భారత మాల, సాగర మాల పధకాలతో మౌలిక వసతుల మెరుగుదలకు కృషి.
21. స్పష్టమైన విదేశాంగ విధానం
22. దేశియ ఉక్కు రంగాన్ని కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతవుతున్న స్టీల్ పై సుంకం విధింపు.
23. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకి ఒకసారి పెట్రోల్ , డీజిల్ రేట్ల సవరింపు.
24. పర్యావరణ హిత  సౌర విద్యుత్, పవన విద్యుత్ లపైన ప్రభుత్వ ప్రత్యేక దృష్టి.
25. ముఖ్యమైన , ప్రాణాంతకమైన జబ్బుల ను నివారించేందుకు వాడే ఔషధాల ధరల నియంత్రణ.
26. గుండె ఆపరేషన్లకు వాడే స్టెంట్ ధరలకు కళ్ళెం.
27. సైన్యం ఆధునికీకరణ.
28. "భారత్ లో తయారి" కార్యక్రమం ద్వారా దేశం లో తయారీ రంగంపైన ప్రత్యేక శ్రద్ధ.
29. నల్ల ధనం పైన పోరాటం
30. వి.ఐ.పి వాహనాలపైన ఎర్ర బుగ్గ వాడే విధానానికి స్వస్తి.
31. ద్రవ్యోల్బణం ( ఇంఫ్లేషన్)  తగ్గుదల
31. అవినీతి పరుల పైన ఉక్కుపాదం .
32. మన్ కి బాత్ ద్వారా సామాన్యుడికి  చేరువ
33. విదేశాల్లో భారత ప్రతిష్ట ఇనుమడింపు.
34. గంగా , నర్మదా నదుల ప్రక్షాళన.
35. సుకన్య సమృద్ది యోజన ద్వారా ఆడ బిడ్డల భవిష్యత్ కు భరోసా.
36. బినామి చట్టం.
37. పెండింగ్ రోడ్ ప్రాజెక్ట్ లకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించడం.

38. చార్ ధాం ప్రాంతాలని కలుపుతూ రైలు మార్గం నిర్మాణం.


దృష్టి సారించాల్సిన అంశాలు:

1. మరిన్ని ఉద్యోగాల సృష్టి.
2. మౌలిక వసతులైన రోడ్లు, రైల్వే ప్రాజెక్ట్ లను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయడం.
3. ప్రభుత్వ బ్యాంకుల మొండి బకాయిల ప్రక్షాళన.
4. విజయ మాల్యాని భారత్ కి రప్పించడం. నల్ల ధనం సంబంధిత కేసులకు త్వరగా పరిష్కారం మరియు ఆస్తుల స్వాధీనం.
5. ప్రభుత్వ సంస్థలన్నిటిని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి.
6. పాకిస్తాన్ తో మరింత కఠిన వైఖరి అవలంబించాలి.
7. విభజన చట్టం ప్రకారం అంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ కేటాయించాలి. రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులివ్వాలి.
8. విద్య, వైద్య రంగాలని ప్రక్షాళన చేయాలి.
9. నక్సలైట్ సమస్యకి పరిష్కారం కనుగొనడం.
10. జవాన్లకి అత్యాధునిక యుద్ధ సామాగ్రి అందజేయడం.
11. భూగర్భ జలాల పెంపు పై ప్రత్యేక శ్రద్ధ వహించడం.
12. అన్ని ప్రభుత్వ సాఖల కార్యకలాపాలను అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి తేవడం.








No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate