- నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నందున గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధనకై కృషి చేయాలి.
- గురజాల-కారెంపుడి -వినుకొండ రహదారిని అద్దంకి నార్కెట్ పల్లి రహదారికి అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలి.
- మాచర్ల - నల్గొండ రైల్వే లైను పనులను త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వే శాఖ పైన ఒత్తిడి తేవాలి.
- గురజాల లో బస్ డిపో ఏర్పాటు చేయాలి. గురజాల ప్రయాణీకుల ప్రాంగణం( బస్ స్టేషన్) లొ సిమెంట్ రోడ్లు నిర్మించి , ఎ.పి.యస్.ఆర్.టి.సి రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
- గురజాల మండల ప్రజలు హైదరాబాద్ వెళ్ళేందుకు వీలుగా రాత్రి సమయంలో పిడుగురాళ్ళ డిపో నుండి గురజాల, మాచర్ల మీదుగా ఆర్.టి.సి బస్ సౌకర్యం కల్పించాలి.
- గురజాల-నర్సరావుపేట, గురజాల-వినుకొండ, గురజాల-మిర్యాలగూడ, గురజాల-నాగార్జున సాగర్ బస్ సర్వీసులు ప్రారంభించాలి.
- అగ్ని ప్రమాదాల ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా అగ్ని మాపక కేంద్రం నిర్మించాలి.
- గురజాల రైల్వే గేట్ హాల్టు లో ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే రిజర్వేషన్ కేంద్రం ఏర్పాటుకు ఈ ప్రాంత నాయకులు ప్రయత్నించాలి.
- వరి,ప్రత్తి,మిర్చి అధికంగా పండించే ప్రాంతం కనుక రైతులకు అనుకూలంగా ఉండేందుకు కోనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ గోదాములు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
- గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని మిని స్టేడియం గా అభివృద్ధి చేయాలి.
- గురజాల మరియు చుట్టుప్రక్కల గ్రామాలను అనుసంధానించే రోడ్లను మెరుగుపర్చాలి.
- రాబోవు 5 సంవత్సరాల్లో గురజాల మండలంలోని వీధులన్నిటికి సిమెంట్ రోడ్లు మంజూరుచేయాలి.
- గురజాలలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలి.
- తాగునీటి ఎద్దడి ఉన్న వీధుల్లో ప్రభుత్వమే బోర్లు వేయించాలి.
- నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గురజాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి మునిసిపాలిటి స్థాయికి అభివృద్ధి చేయాలి.
- వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నెల కొక సారి గురజాల మండల ప్రజల సమస్యలు , అభివృద్దికై తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్షించాలి.
- అంటువ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు పక్షం రోజులకొకసారి ఫాగింగ్ జరిపేలా పంచాయితీ అధికారులను ఆదేశించాలి.
- మాచర్ల- గురజాల - దాచేపల్లి మార్గాన్ని 4 వరసలుగా విస్తరించాలి.
Friday, October 10, 2014
మా ఊరి కోసం -- గురజాల అభివృద్ధి కి సూచనలు
Subscribe to:
Post Comments (Atom)
Translate
-
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక ...
-
గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట...
Good Sites
- బాలు ఎఫ్.ఎం - బాలు పాడిన తెలుగు పాటలు మాత్రమే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బ్రతకాలంటే ఏం చేయాలి?
- సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే?
- సినిమా అవకాశాలు తెస్తున్న లఘు చిత్రాలు
- మనిషికి భక్తి అవసరమా?
- నల్ల ధనం వెలికితీత వల్ల ఒరిగేదేమిటి?
- నా కవితలు
- ఈ సంగతి మీకు తెలుసా!
- తెలుగు పదకోశం (డిక్షనరీ)
- యూట్యూబ్ లో నేను మెచ్చినవి
- ఇంటర్నెట్ లో తెలుగు లో రాయడం ఎలా?
- Jobs,JobMaterial,Internships,Placement papers
No comments:
Post a Comment