Saturday, July 28, 2012
హిందు ధర్మ పరిరక్షణ కై నేను సైతం...
ఈ ప్రపంచం లోని సర్వ ప్రాణులను సమ దృష్టి తో చూసేది,
సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించేది, శాంతి సామరస్యాలను పెంపొందించేది మన హిందు
ధర్మం. అట్టి హిందు ధర్మం 21 వ శతాబ్దం లో ఎదుర్కొంటున్న సవాళ్ళను , ధర్మ పరి రక్షణకై
తీసుకోవాల్సిన చర్యలను చర్చింటానికి భక్తి ధార్మిక సమ్మేళనం పేరిట ఒక వేదిక ఎర్పాటు
కావడం ఒక శుభ పరిణామం.
10.
పండుగలు, ఉత్సవాలు, భజనాలు, సత్సంగాలు ద్వారా హిందు సమాజాన్ని ఐక్యం చేయడం.
Friday, July 27, 2012
తెలుగు సినిమా పై బాలీవుడ్ కన్ను
తెలుగు లో విజయం సాధించిన సినిమాని హిందీ లో నిర్మించడం. అక్కడ హిట్ కొట్టడం. ఇదే ఇప్పుడు హిందీ చిత్ర సినిమా లో కనిపిస్తున్న కొత్త పోకడ. బాలీవుడ్ హీరో ల రాత మారుస్తున్నవి మన తెలుగు సినిమాలే అంటే అతిశయోక్తి కాదేమో..
గడచిన 4 సంవత్సరాల కాలాన్ని పరిశీలించినట్లైతే కనుక దక్షిణాది చిత్రాల ఆధారంగా హిందీ లో నిర్మించిన అనేక సినిమాలు అక్కడి ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయని చెప్పొచ్చు. వీటిలో తెలుగు సినిమాలూ ముఖ్య భూమికని పోషిస్తున్నాయి. నిర్మాత కి కాసుల పంట పండాలన్నా, హీరోలు అపజయాలని మరచి విజయాల బాట పట్టాలన్నా ఇప్పుడు తెలుగు సినిమాలే దిక్కు.
ఆ మధ్య సల్మాన్ ఖాన్ తెలుగు సినిమా "పోకిరి" కి రీమేక్ ఐన 'వాంటెడ్' చిత్రంలో నటించి తన 2 వ ఇన్నింగ్స్ ని విజయాలతో ఆరంభించాడు. వరుస వైఫల్యాలతో సతమవుతున్న అక్షయ్ కుమార్ ఇటీవల 'రౌడీ రాథోడ్' చిత్రంతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. రౌడీ రాథోడ్ చిత్రానికి మాతృక మన తెలుగు సినిమా "విక్రమార్కుడు". మరో హీరో అజయ్ దేవ్గణ్ 'సన్ ఆఫ్ సర్ధాఋ చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చెయబోతున్నాడు. సన్ ఆఫ్ సర్ధార్ సినిమా "మర్యాద రామన్న" ఆధారంగానే నిర్మితమైంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ'రెడీ' మన తెలుగు 'రెడీ' కి రీమేక్. త్వరలో హిందీ కిక్ ని ప్రారంభించబోతున్నాడు.
త్వరలో మరిన్ని తెలుగు హిట్ సినిమాలు హిందీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. అరుంధతి , ఢీ, అలా మొదలైంది, మగధీర , సీమ టపాకాయ , ఠాగూర్ , ఇంద్ర వాటిలో కొన్ని. ఇంకా ఎన్నో తెలుగు హిట్ చిత్రాలపై హిందీ నిర్మాతలు కన్నేశారు.
హీరోయిజం , తగినంత కామెడి , కధా కధనాలు , అత్యున్నత సాంకేతిక విలువలు వీటికి తోడు తెలుగు ప్రేక్షకుడి అభిరుచులు , బాలీవుడ్ సినీ ప్రియుల అభిరుచులకు దగ్గరగా ఉండటం మన కధలు అక్కడి వారిని అలరించడానికి కారణాలు. ఈ ధోరణి తెలుగు నిర్మాతలకు శుభ పరిణామమే.
Subscribe to:
Posts (Atom)
Translate
-
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక ...
-
గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట...
Good Sites
- బాలు ఎఫ్.ఎం - బాలు పాడిన తెలుగు పాటలు మాత్రమే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బ్రతకాలంటే ఏం చేయాలి?
- సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే?
- సినిమా అవకాశాలు తెస్తున్న లఘు చిత్రాలు
- మనిషికి భక్తి అవసరమా?
- నల్ల ధనం వెలికితీత వల్ల ఒరిగేదేమిటి?
- నా కవితలు
- ఈ సంగతి మీకు తెలుసా!
- తెలుగు పదకోశం (డిక్షనరీ)
- యూట్యూబ్ లో నేను మెచ్చినవి
- ఇంటర్నెట్ లో తెలుగు లో రాయడం ఎలా?
- Jobs,JobMaterial,Internships,Placement papers