Sunday, September 26, 2010

నానక్‌రాంగూడాని పట్టించుకోని RTC, GHMC

                     


      


                      వేగంగా ఐ.టి కార్యాలయాలు విస్తరిస్తున్న నానక్‌రాంగూడ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దర్గా నుండి ఖాజాగూడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో జంక్షన్ చేరాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. విప్రో, డెలాయిట్, వర్ట్యుసా, ఐ.సి.ఐ.సి.ఐ, పోలారిస్, మైక్రోసాఫ్ట్, యు.బి.యస్, క్యాప్ జెమిని ,ఇన్‌ఫోటెక్, సి.ఎ తదితర కంపెనీల ఉద్యోగులు ఎంతోమంది ఈ మార్గంలో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డు ద్వారా ప్రయాణించేవారెవరైనా మన భాగ్యనగరం పేరుకే హైటెక్, రోడ్లన్నీ లోటెక్ అని నిర్ఘాంతపోయి ముక్కున వేలేసుకోవాల్సిందే.ప్రస్తుతం విప్రో జంక్షన్ నుండి నానక్‌రాంగూడ మీదుగా దాబా సిగ్నల్ వరకు ఉన్న 10 కి.మీ. రహదారిని 6 వరుసలుగా విస్తరిస్తే తప్ప ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల కష్టాలు తీరవు.  


                హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నానక్‌రాంగూడ ఐ.టి పార్క్ అంతకంతకు వృద్ధి చెందుతున్నప్పటికీ ఎ.పి.యస్.ఆర్.టి.సి ఈ ప్రాంతానికి బస్ సర్వీసులు నడపడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంతోమంది ఉద్యోగులు పనిచేసే ఈ ప్రాంతం నుండి నగరంలోని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించటంలో మన ఆర్.టి.సి ఘోరంగా విఫలమైంది. 


                 లింగంపల్లి, మెహిదిపట్నం డిపో అధికారుల అశ్రద్ధ  వల్ల ఆర్.టి.సి లక్షలాది  రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది. ఇదే అదనుగా ఆటోవాలాలు హవా నడిపిస్తున్నారు. నానక్‌రాంగూడ ఐ.టి పార్క్ పరిసరాల్లో 2 లక్షలమంది వరకు ఐ.టి, బి.పి.ఓ ఉద్యోగులు పనిచేస్తారనేది ఒక అంచనా. ఎంతో ముఖ్యమైన ఈ మార్గాన్ని నగరంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన మాధాపూర్, లింగంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఉప్పల్, బేగంపేట, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలతో కలిపేందుకు ఆర్.టి.సి సత్వర చర్యలు తీసుకోవాలి.










                
                విప్రో జంక్షన్ నుండి ఐ.ఐ.ఐ.టి, కొత్తగూడ మీదుగా మాధాపూర్, కూకట్‌పల్లి  జె.యన్.టి.యు వెళ్ళేందుకు రోజుకు సుమారు 50000 మంది ఉద్యోగులు ఆటోలను ఆశ్రయిస్తున్నరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గంటకొకసారి ఈ మార్గంలో ఆర్.టి.సి అరకొర సర్వీసులు తిప్పుతున్నప్పటికీ అవి రద్ది సమయాలైన ఆఫీస్ వేళల్లో ఏ మూలకు సరిపోవు. అంతర్జాతీయ సంస్థలు, ఐ.టి కేంద్రాలకు నెలవైన ఈ ప్రాంతంలో విలాసవంతమైన ఏ.సి సర్వీసులు నడపాలనే ఆలోచన ఇంతవరకు రాకపోవటం దిగ్బ్రాంతిని కలిగించే నిజం. 


                 ప్రస్తుతమున్న 118 డబ్ల్యు, 116 యన్, 216 యల్, 10 హెచ్ /డబ్ల్యు ట్రిప్పుల సంఖ్యను రద్ధీ వేళల్లో విపరీతంగా పెంచటమే కాక మరిన్ని కొత్త మార్గాలను అన్వేషించి బస్ సర్వీసులు నడపాలి. ఇప్పటికైన అధికార్లు స్పందించి ఆర్.టి.సి కి బంగారు బాతైన  ఈ మార్గంపైన తక్షణమే దృష్టి సారించాలి. 


             ఈ సమస్యకు నిధులక్కర్లేదు. కొత్త బస్సులక్కర్లేదు. గంటకు 10 పైగా బస్సులు మెహిదిపట్నం నుండి లింగంపల్లి వైపు గచ్చిబౌలి నుండి వెళతాయి. అందులో కొన్ని బస్సులని నానక్ రాం గూడా మీదుగా మళ్ళించి విప్రో, ఐ.ఐ.ఐ.టి మీదుగా లింగంపల్లి పంపితే సరిపోతుంది. 

Saturday, September 18, 2010

ఐ.టి కేంద్రం గచ్చిబౌలిని వేధిస్తున్న ట్రాఫిక్




                  అది హైదరాబాద్ నగరానికి  అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన  ఐ.టి సంస్థలు కొలువుదీరిన ప్రాంతం. అక్కడ లక్షలాది ఐ.టి నిపుణులు నిరంతరం కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు.  ఇప్పటికే మీకు ఆ ప్రాంతమేదో తెలిసిపోయినట్లుంది. అదే మన గచ్చిబౌలి. ఇప్పుడు గచ్చిబౌలిని తీవ్రమైన ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది. గచ్చిబౌలిని చేరాలంటే అష్టకష్టాలు పడాల్సిందేనని ప్రతిఒక్కరు ఒప్పుకుంటున్నారు.
     ఎందుకంటే ఇటీవల కాలంలో గచ్చిబౌలి నగరానికి కొత్త చిరునామాగా మారిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డు మొదటి ఫేజ్ మొదలవటమే కాకుండా అనేక ఐ.టి సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటుచేస్తున్నాయి. ట్రాఫిక్  విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నానక్ రాంగూడ, ఐ.ఐ.ఐ.టి, మాధాపూర్ , హైటెక్ సిటి ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది ఐ.టి ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కొత్తేమి కాకపోవచ్చు కాని ఈ విషయంలో పరిస్థితిని మెరుగుపర్చనట్లైతే కనుక  నగరం వెనుకబడే అవకాశం ఉంది. ఈ చిన్న ఉదాహరణ చూస్తే ఐ.టి. ఉద్యోగులు ఎంత విలువైన సమయాన్ని వృధా  చేస్తున్నారో ఇట్లే  అర్ధమవుతుంది.
       గచ్చిబౌలిని చేరటానికి ఉన్న ప్రధాన మార్గాల్లో వయా మెహిదీపట్నం  ఒకటి. మెహిదీపట్నం నుండి గచ్చిబౌలి జంక్షన్ కి ఉన్న దూరం కేవలం 10 కి.మీ కానీ గచ్చిబౌలి చేరటానికి పట్టే సమయం గంటన్నర. ఇది ఆఫీస్ వేళలైన ఉదయం 8 నుండి 11 వరకు మరియు  సాయంత్రం 5.30 నుండి రాత్రి  8.30 వరకు పరిస్థితి. ఈ మొత్తం సమయంలో 45 నిమిషాలను ట్రాఫిక్ భూతం హరిస్తుంది.
                మొదటగా వచ్చేది టొలిచౌకి , అక్కడ మతపరమైన కట్టడాలకు తోడు, కొంత రోడ్డు తోపుడు బండ్ల ఆక్రమణలకు గురైంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులున్నా పట్టించుకోని పరిస్థితి కారణంగా 10 నిమిషాలు వృధా. తరువాత వచ్చేది దర్గా. అప్పటివరకు వెళ్ళే మార్గంలో నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డు మార్గం ఒక్కసారిగా సిగ్నల్ దాటిన వెంటనే కుంచించుకుపోయింది. అక్కడ రోడ్డు మధ్యలో ఉన్న ఒక్క చికెన్ దుకాణం కారణంగా 25 నిమిషాలకు పైగా నారాయణమ్మ కాలేజ్ వరకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇవన్ని దాటిన వారికి మరో ట్రాఫిక్ గండం హైటెక్ సిటీ కి వెళ్ళేందుకు కొత్తగా ఏర్పాటుచేసిన రహదారి. హైటెక్ సిటీకి వెళ్ళేందుకు మరియు అక్కడనుండి వచ్చేవారు గచ్చిబౌలి వెల్లటానికి యు టర్న్   తప్పనిసరి. అక్కడ మరో 10 నిమిషాలు వృధా. ఇలా చిన్న చిన్న కారణాలవల్ల రోజుకు ఆ మార్గంలో ప్రయాణించే 20000 మంది పైగా ఉద్యోగులు ఒక సంవత్సర కాలంలో వృధా చేస్తున్న మొత్తం గంటలెన్నో తెలుసా. అక్షరాలా 72 లక్షల గంటలు.  దీనికంతటికి కారణం ట్రాఫిక్ పోలిసులు మరియు జి.హెచ్.ఎం.సి అధికార్ల నిర్లక్ష్యమే. అధికారులు తక్షణం  స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.           

 

Thursday, September 9, 2010

విశాఖ విమానాశ్రయం సంగతేంటి?


   
 విశాఖ కు అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం లేదా? హైదరాబాద్ విమానాశ్రయాన్ని చూసినా, తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా  అభివృద్ధి చేయబోతున్నారని విన్నా వెంటనే మన మదిలో కలిగే ప్రశ్న ఇదే మరి. విశాఖ లో కూడా త్వరలో హైదరాబాద్ తరహాలో  పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ విమానాశ్రయం రూపకల్పన కోసం మన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

              ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయపరంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖ ఒకటి. ఇటీవల ఒక సర్వే ప్రకారం దేశంలో అత్యంత వేగంగా ప్రగతి సాధిస్తూ విస్తరిస్తున్న నగరాల్లో విశాఖ ముందువరుసలో ఉంది. తూర్పు తీర నౌకాశ్రయాల్లో విశాఖ ప్రధానమైనది. కె.జి బేసిన్ నిక్షేపాల కారణంగా ఈ ప్రాంత స్వరూపమే మారిపోయింది. ఫార్మా రంగంలోనూ విశాఖ దూసుకెళుతుంది. మన రాష్ట్రంలో రెండవ శ్రేణి ఐ.టి. నగరం అనగానే మొదట గుర్తొచ్చేది కూడా మన విశాఖనే. వీటికి తోడు సహజసిద్దమైన సముద్ర తీరం విశాఖ సొంతం కావటం వల్ల టూరిస్టుల తాకిడి ఎక్కువే. ఇవే కాకుండా ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో, ఎన్నెన్నో.  ఏ రంగంలోనైనా  హైదరాబాదుతో పోటీ పడుతున్న, భవిష్యత్ లో పోటీ పడగల సత్తా ఉన్న నగరాల్లో విశాఖ తప్ప మరేవి మన రాష్ట్రంలో లేవు.


          ఇన్ని ప్రత్యేకతలు ఉన్న విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించట్లేదు? మన ప్రభుత్వం అశ్రద్ధా లేక, అక్కడి నాయకుల నిర్లక్ష్యమా? విశాఖ నగరంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ సమయాన్ని వృధా చేస్తుందా? 





           ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిగా రక్షణ అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో కొత్త విమానాశ్రయం నిర్మించాలి.మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థుతుల దృష్త్యా కూడ కోస్తా ప్రాంతంలో ఉన్న విశాఖ నగరంలో త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసి ప్రాంతీయ అసమానతలు తొలగించటంలో ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాలనేది ప్రతి తెలుగువాడి ఆవేదన.   





Hyderabad International Airport:

the airport is being billed as India's first truly world-class airport, offering facilities on par with those at Oslo, Hong Kong, Kuala Lumpur and Singapore airports. The developers claim this project would take Indian airports to a new era.

The airport, which has come up on 5,000 acres of land, has 4,260-metre runway, the longest in South East Asia. The airport has been built by GMR Hyderabad International Airport Limited (GHIAL), a joint venture in which GMR Infrastructure Limited holds 63 percent, Malaysia Airports Holding Berhad 11 percent, Airports Authority of India (AAI) 13 percent and the Andhra Pradesh government 13 percent.

Designed to handle 12 million passengers in the first phase, the airport is expected to make the city an international hub on par with Dubai and Singapore and a cargo hub of Southeast Asia. The ultimate capacity of the airport is 40 million passengers a year and one million tones of cargo annually.

The non-polluting airport has 100,005 square metre glass encased terminal, which promises natural light to passengers. The seven-storey passenger terminal building has been built by the China State Construction Engineering (Hong Kong).

It is also the first airport in the country to have no demarcation between international and domestic terminals, making passenger movements easy. It also has a unique airport village with commercial space where passengers can meet their friends and relatives.

The airport has 70-metre-tall Air Traffic Control (ATC) with the state-of-the-art equipment, a world-class cargo terminal, 42 aircraft parking stands with 12 aero-bridges and 30 remote parking bays, 60 check-in counters with Common User Terminal Equipment (CUTE) and 16 self check-in kiosks.

It is being developed in three phases, and when completed will provide infrastructure for 40 million passengers annually.[3] The airport is expected to be the largest in terms of area and will provide world-class facilities. After the first phase of development, the airport will accommodate 10 million passengers a year.[3] The total cost of the project is INR 24.7 Billion (US$560 million). [16] The airport is being built on an area of 5,400 acres (22 km2).


First phase:
In the first phase of development, the 105,300 m2 (1,133,000 sq ft) Terminal 1, with the capacity to handle 12 million passengers per annum has been constructed. Terminal 1 has 12 contact and 30 remote stands for aircraft parking. Other buildings, including the air traffic control tower, Technical Building, cargo hangars (100,000 tonnes capacity), maintenance hangars, utilities under a combined area of 35,000 m2 (380,000 sq ft) have also been developed. A 1500-car parking lot in front of Terminal 1 is operational for the convenience of passengers and visitors to the airport. A hotel has also been constructed in this phase.

Second phase:
In the second phase of the airport development, Terminal 1 will be expanded to an area of 250,000 m2 (2,700,000 sq ft) to cater to the growing demand. Post expansion, the terminal building will have 54 stands for aircraft parking. The low cost terminal will also be expanded to its full capacity of 1.5 m passengers per annum.
A second runway, needed before commencement of Terminal 2, will be constructed. An increase in established facilities such as hotels, offices, cargo and maintenance facilities will be undertaken. The total developed area at the end of this phase will be approximately 470,000 m2 (5,100,000 sq ft).

Final phase:
The airport will reach its full maturity after the third phase. An additional floor area of 430,000 m2 (4,600,000 sq ft) will be developed bringing the total built-up area to 900,000 m2 (9,700,000 sq ft).
The ultimate master plan provides for a capacity of 40 million passengers per annum with the accompanying air and ground facilities. Further acquisition of land to the north and south will allow expansion of a third and fourth runway on demand.




Tirupati International Airport:

The airport is situated at a distance of 14 km from Tirupati city.Laying foundation stone for the new Integrated Terminal at Tirupati Airport , he said with our fast economic development, PM Dr. Manmohan Singh said that during the last 7 years, domestic air traffic has tripled and international traffic more than doubled.

Singh said that once this new integrated terminal is operational, the Tirupati airport will have the capacity to handle 500 domestic and 200 international passengers during peak hours.  The new Terminal Building will be equipped to provide modern state of the art amenities to passengers.

After international operations commence at Tirupati airport, pilgrims from neighbouring countries like Singapore, Malaysia and Srilanka would find it easier to come to Tirupati in large numbers, contributing to its development into a major religious-cum-tourist hub, he added.

Expressing his pleasure to laid foundation stone for the new integrated terminal complex for Tirupati Airport, the Prime Minister said Tirupati is one of the major pilgrim centers in our country and attracts people as pilgrims from all over the world.

The prime minister noted that the entire investment for the new integrated terminal is being met through the budgetary resources of the government. The first phase of the project is estimated to cost Rs.174 crore.
The state government has already handed over 293 acres of land out of the 718 acres committed for modernization and development of the airport.

India in Modi Rule 2014-24

Translate