Sunday, September 11, 2016

ఇచ్చింది తీసుకోండి..రావాల్సిన వాటి కోసం పోరాడండి



               
  ప్రత్యేక హోదా ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం హోదాను నిరాకరించి ప్రత్యేక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఐతే ప్రత్యేక హోదా తో పాటు, విభజన చట్టంలో ని అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది.

                సెప్టెంబర్ 8, 2016 న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత నిచ్చింది కాని ప్రత్యేక హోదా ఊసు మాత్రం ఎత్తలేదు. ఐతే ప్రస్తుత సందర్భంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించడం కంటే రాష్ట్ర ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని రకాల సాయాలను స్వీకరించడం మంచిది. 

                ఆంధ్ర రాష్ట్రానికి సెప్టెంబర్ 8, 2016 న ప్రకటించిన సాయం నామ మాత్రమే. ఈ కింది అంశాల పైన అంధ్రా నేతలు పోరాడాలి.

          1. రాజధాని డి.పి.ఆర్ తయారైన వెంటనే నిర్మాణానికి మరిన్ని నిధుల కోసం పోరాడాలి.
          2. పోలవరం నిర్మాణానికి మాత్రమే కాకుండా, పునరావాసానికి కూడా కేంద్రమే నిధులు భరించేలా న్యాయ పరమైన హామీ కేంద్రం నుండి లభించే వరకు ఒత్తిడి తేవాలి.

          3. దుగ్గరాజ పట్నం భారీ ఓడ రేవుని కేంద్రం నిర్మించి నిర్వహించేటట్లు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.

          4. ప్రస్తుతమిచ్చిన పన్ను రాయితీలు ఏ మాత్రం కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి సరిపోవు కనుక మరిన్ని విలువైన పన్ను రాయితీల కోసం పార్లమెంట్ లో ఎం.పి లు అందరు పోరాడాలి.

          5. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు పై కేంద్రాన్ని నిలదీయాలి. 

          6. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యా సంస్థల సొంత భవనాలకై మరిన్ని నిధులు విదుదల అయ్యేలా, సకాలానికి పనులు పూర్తయ్యేలా జాగ్రత్త వహించాలి.  

         7. విజయవాడ, విశాఖ, తిరుపతి  మెట్రో రవాణ వ్యవస్థలకు కేంద్ర నిధులు సాధించాలి.

1 comment:

  1. మీరు వ్రాసిన పాయింట్లలో చివరి పదాలు బాగున్నాయి పోరాడాలి ... నిలదీయాలి .. సాధించాలి ఇలా ...
    అయితే ప్రస్తుతం ఇవేగా చేస్తున్నది ..
    సొంత ఇంటిముందు ఓనరు ముష్టి ఎత్తుకున్నట్లు ఉంది

    ReplyDelete

India in Modi Rule 2014-24

Translate