గర్భిణి మహిళల్లో పిండం ఎదుగుదల గుర్తించేందుకు సాధారణంగా ప్రతి 3 మాసాలకు ఒక త్రైమాసిక ( ట్రైమిస్టర్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. మొదటి త్రైమాసిక పరీక్షలో కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో పరిశీలిస్తారు. ఎవైనా శరీర భాగాలలో ఎదుగుదుల లోపం ఉన్నట్లైతే వాటికి జన్యు పరమైన లోపాలు కారణమయ్యే అవకాశం ఉంది.
అలాంటి జన్యుపరమైన లోపాలను తొలిదశ లోనే గుర్తించేందుకు 2 టెస్ట్ లు చేయించుకోవాలని గైనకాలజిస్ట్ లు చెప్తారు.
1. ఆమ్నియోసింతెసిస్ 2. ఫిష్ టెస్ట్ లు. ఇవి కొంచెం ఖర్చుతో కూడిన టెస్ట్ లు. హాస్పిటల్ ని బట్టి వీటికయ్యే ఖర్చు 15-
20 వేల మధ్య ఉండొచ్చు.
ఆమ్నియోసింతెసిస్ ఫలితాలు రావడానికి 4 వారాలు పడుతుంది. ఫిష్ టెస్ట్ ఫలితాలు ఒక వారంలో వస్తాయి.
రెండు టెస్ట్ ల కోసం పిండం లో ఉండే ఉమ్ము నీరు సేకరిస్తారు. జన్యు పరమైన ఇబ్బందులనుండి పుట్టబోయే బిడ్డని కాపాడడం కోసం ముఖ్యంగా డౌన్ సిండ్రోం సమస్యలు నివారించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లీదండ్రులు ఆశిస్తారు. ఈ టెస్ట్ ల గురించి నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ ల సలహా మేరకు ప్రతి గర్భిణి నడుచుకుంటే అంతా మంచే జరుగుతుంది. శుభం భుయాత్.
మరింత సమాచారం కోసం కొన్ని లింక్స్:
http://www.cyh.com/HealthTopics/HealthTopicDetails.aspx?p=438&np=459&id=2765
http://www.webmd.com/baby/amniocentesis
http://www.advancedwomensimaging.com.au/prenatal-diagnostic-testing
No comments:
Post a Comment