- క్షణం విలువ తెలియాలంటే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాడిని అడగాలంట. నిమిషం విలువ తెలియాలంటే- చుస్తూండగానే రైలు తప్పిపోయిన వాడిని అడగాలి. గంట విలువ తెలియాలంటే ఎవరి కోసమో నిరీక్షించేవారిని, రోజు విలువ తెలియాలంటే ఆకలితో గడిపిన వాడిని అడగాలంటారు.వారం విలువ తెలియాలంటే బంధువుల ఇంట్లో గడిపిన వాళ్ళను అడగాలట. నెల విలువ తెలియాలంటే జీతం అందుకున్న ఉద్యోగిని, సంవత్సరం విలువ తెలియాలంటే - కష్టపడి చదివినా ఏదో కారణాల వల్ల పరీక్ష తప్పిన విద్యార్ధిని అడిగితే కచ్చితంగా చెప్తారంటారు అనుభవజ్ఞులు .
Saturday, July 9, 2016
నాకు నచ్చిన వాక్యాలు / సంభాషణలు !
పిండంలో జన్యు పరమైన లోపాలను ముందుగా గుర్తించే టెస్ట్ లు:
గర్భిణి మహిళల్లో పిండం ఎదుగుదల గుర్తించేందుకు సాధారణంగా ప్రతి 3 మాసాలకు ఒక త్రైమాసిక ( ట్రైమిస్టర్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. మొదటి త్రైమాసిక పరీక్షలో కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో పరిశీలిస్తారు. ఎవైనా శరీర భాగాలలో ఎదుగుదుల లోపం ఉన్నట్లైతే వాటికి జన్యు పరమైన లోపాలు కారణమయ్యే అవకాశం ఉంది.
అలాంటి జన్యుపరమైన లోపాలను తొలిదశ లోనే గుర్తించేందుకు 2 టెస్ట్ లు చేయించుకోవాలని గైనకాలజిస్ట్ లు చెప్తారు.
1. ఆమ్నియోసింతెసిస్ 2. ఫిష్ టెస్ట్ లు. ఇవి కొంచెం ఖర్చుతో కూడిన టెస్ట్ లు. హాస్పిటల్ ని బట్టి వీటికయ్యే ఖర్చు 15-
20 వేల మధ్య ఉండొచ్చు.
ఆమ్నియోసింతెసిస్ ఫలితాలు రావడానికి 4 వారాలు పడుతుంది. ఫిష్ టెస్ట్ ఫలితాలు ఒక వారంలో వస్తాయి.
రెండు టెస్ట్ ల కోసం పిండం లో ఉండే ఉమ్ము నీరు సేకరిస్తారు. జన్యు పరమైన ఇబ్బందులనుండి పుట్టబోయే బిడ్డని కాపాడడం కోసం ముఖ్యంగా డౌన్ సిండ్రోం సమస్యలు నివారించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లీదండ్రులు ఆశిస్తారు. ఈ టెస్ట్ ల గురించి నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ ల సలహా మేరకు ప్రతి గర్భిణి నడుచుకుంటే అంతా మంచే జరుగుతుంది. శుభం భుయాత్.
మరింత సమాచారం కోసం కొన్ని లింక్స్:
http://www.cyh.com/HealthTopics/HealthTopicDetails.aspx?p=438&np=459&id=2765
http://www.webmd.com/baby/amniocentesis
http://www.advancedwomensimaging.com.au/prenatal-diagnostic-testing
Saturday, July 2, 2016
విశ్వ నగరం సంగతి దేవుడెరుగు..రోడ్ల సంగతేంటి? కరెంట్ కి నిలకడేది?
పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత మన హైదరాబాద్ కి కరెక్ట్ గా సరిపోతుంది. చెప్పుకోవడానికేమో హైటెక్ సిటి. రోడ్లు పూర్తిగా బురద మయం. ఒక పక్క వర్షాలు , మరో పక్క మెట్రో పనులు , ఇంకొక వైపు మంజీర మరియు క్రిష్ణా పైపు లైను పనులు వెరసి హైదరాబాద్ రోడ్లని బురదమయం చేశాయి.
బోరబండ బస్తీ ఐనా, హైటెక్ సిటి పరిసరాలైనా రోడ్లు మాత్రం ఒకటే రకం. కొద్ది దూరాల ప్రయాణీకులు సైతం గంటల తరబడి ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక దూరప్రయాణికుల కష్టాలకు అంతే లేదు. పట్టించుకునే నాధుడు లేడు, స్పందించి తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం మచ్చుకైనా కానరాదు. హైదరాబాదు లొ ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , విద్యార్ధులు వర్గం ఎదైనా సమస్య ఒక్కటే. ట్రాఫిక్ చిక్కులు. అధ్వాన్న రోడ్లు.
గత 6 నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ సరఫరా అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ హైదరాబాద్ లో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా ఐ.టి హబ్ పరిసరాలైన గచ్చి బౌలి, హైటెక్ సిటి, కొండా పూర్, నానక్ రాం గూడ, మాదాపుర్ పరిసరాల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీని పరిస్థితి. ఒక గంటలొ పది సార్లు కరెంట్ పోయి, వచ్చే పరిస్థితి. ఈ కరెంట్ ఆటలకు చెల్లు ఎప్పుడు?
Subscribe to:
Posts (Atom)
Translate
-
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక ...
-
గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట...
Good Sites
- బాలు ఎఫ్.ఎం - బాలు పాడిన తెలుగు పాటలు మాత్రమే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బ్రతకాలంటే ఏం చేయాలి?
- సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే?
- సినిమా అవకాశాలు తెస్తున్న లఘు చిత్రాలు
- మనిషికి భక్తి అవసరమా?
- నల్ల ధనం వెలికితీత వల్ల ఒరిగేదేమిటి?
- నా కవితలు
- ఈ సంగతి మీకు తెలుసా!
- తెలుగు పదకోశం (డిక్షనరీ)
- యూట్యూబ్ లో నేను మెచ్చినవి
- ఇంటర్నెట్ లో తెలుగు లో రాయడం ఎలా?
- Jobs,JobMaterial,Internships,Placement papers