నిజాయితీ లేని నాయకుల భవితకు సమాధి కట్టే ఇటుక ఓటు.
అవినీతి వ్యవస్థల దుమ్ము దులిపే చీపురు ఓటు.
కుళ్ళిపోయిన రాజకీయాలకు చికిత్స చేసే ఔషధం ఓటు.
అభివృద్ధి ఫలాలు అట్టడుగు ప్రజలకు అందించే మార్గం ఓటు.
దేశాన్ని ప్రేమించే సచ్ఛీల నాయకులను చట్ట సభలకు పంపే అధికారం ఓటు.
నిరుద్యోగాన్ని రూపు మాపి యువతకు దారి చూపే స్థైర్యం ఓటు.
ధనబలంతో రాజకీయాలను శాసించే మద గజాలను నియంత్రించే అంకుశం ఓటు.
జాతి,మత,ప్రాంత,కుల వైషమ్యాలను పెంచే వారికి చరమగీతం ఓటు.
నేటి బాలల, రేపటి పౌరుల ఆశల భారతానికి వారధి ఓటు.
సువర్ణ,సుభిక్ష భారతాన్ని భవిష్యత్ తరాలకు అందించే వజ్రాయుధం ఓటు.
No comments:
Post a Comment