Sunday, July 25, 2010

SP BALU Forever(ఎస్.పి. బాలసుబ్రమణ్యం)





            ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఈ పేరు తెలియని తెలుగు వాడు ఉండడేమో? ఆయన పాట ఆచంద్రతారార్కం. అజరామరం. తెలుగు జాతి చేసుకున్న పుణ్యమో లేక భారత చలన చిత్ర పరిశ్రమ అదృష్టమో తెలీదు కానీ ప్రతి ఒక్కరిని తన గాత్ర మాధుర్యంలో తడిసి ముద్దయ్యేలా చేస్తున్నాడు.


                            తెలుగు ప్రజల జీవితాలని రాగ రంజితం చేసేందుకు ఈ గాన గంధర్వుడిని ఆ సంగీత సరస్వతే స్వయంగా సాగనంపిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. 35000 వేలకు పైగా పాటలు పాడిన మన బాలు తన పని పాటలు పాడటంతో ఆగిపోలేదని, పర భాషా గాయకుల అవసరం  తెలుగు సినీకళామతల్లికి రాకుండా, భవిష్యత్ తెలుగు గాయకులను సిద్దం చేస్తున్నాడు.  తెలుగు పాటకే కాదు భాష కి కుడా బాలు చేస్తున్న సేవ ప్రశంసనీయం. మనం తెలుగువారం తెలుగులోనే మాట్లాడుదాం అని తన ప్రతి కార్యక్రమంలో అందరికి సూచిస్తున్నాడు. మమ్మీ, డాడి ని ప్రోత్సహించే నేటి తరం తల్లిదండ్రులకు వారి పిల్లలకు తెలుగుని తప్పనిసరిగా నేర్పించాలని, తెలుగు భాషకే సంపద వంటి వేమన పద్యాల గొప్పతనం తెలియజేయాలని నొక్కి చెప్తూనే ఉన్నాడు.

                            బాలు గొంతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గొంతులో ఏదో మంత్రదండం ఉంది. మనల్ని సమ్మోహనం చేసే శక్తి ఉంది. రొగాలని మాయం చేసే మందులున్నాయ్. క్షణాల్లో హుషారెక్కించే ఉత్ప్రేరకాలు ఉన్నాయ్.  అదేంటో ఏ నటుడికి పాడితే ఆ నటుడే నిజంగా  పాడినంత సహజత్వం వస్తుంది. ఇక అవార్డులంటారా, అవి అన్ని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చినవే.

                             ఈ పాటల రాజు మరెన్నో విజయ తీరాలు చేరాలని నేను కోరుకుంటున్నాను.   రెండు వందల పాటలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని పేర్చాను..ఇక వినడమే ఆలస్యం.   



బాలు గానలహరి-1
http://www.raaga.com/listen/?5079989

http://www.raaga.com/channels/home/sharedlist.asp?tid={B602ADE3-EA9F-4759-8D19-1DA2C3EB80CE}

బాలు గానలహరి-2
http://raa.ag/p5079915
http://www.raaga.com/channels/home/sharedlist.asp?tid={4DEADF85-5CF6-4DBC-AF63-93B5D27F0535}









No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate