Tuesday, April 12, 2011

తెలుగు హీరోలు తమిళ హీరోలని చూసి నేర్చుకోండి.




తెలుగు హీరోలు తమిళ హీరోలకంటే ఒక విషయంలో వెనకబడిపోతున్నారు. హీరోలు అనేకంటే నిర్మాతలంటే బాగుంటుందేమో? కమల్ హాసన్, రజినీ కాంత్, విక్రం, సూర్యా, శంకర్, మణి రత్నం వీరందరికీ ఒక పోలిక ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నటులు మరియు దర్శకులందరూ దక్షిణాదిన అన్ని భాషల్లో మార్కెట్ సృష్టించుకున్నారు.. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నటులు, నిర్మాతలు తెలుగు కి మాత్రమే పరిమితమవుతున్నారు. అందుకే తెలుగు సినీ నటులు ఒక రజినీ కాంత్, కమల్ హాసన్, యువ నటుడు సూర్యా లాగా దక్షిణాదిన అన్ని భాషల్లో తమ మార్కెట్ ని విస్తరించుకోలేకపోతున్నారు.

 తెలుగు లోని యువ నటులు ఎన్.టి.ఆర్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు , రానా, రవి తేజ , మంచు బ్రదర్స్ , శ్రీకాంత్, నాగ చైతన్య, తరుణ్, అల్లరి నరేష్, గోపీ చంద్ ,సిద్దార్థ్, ప్రభాస్, రాం, నాని, నవదీప్, వరుణ్ సందేశ్, నితిన్ వీరంతా తప్పనిసరిగా తమ సినిమాలు తెలుగుతో పాటుగా వీలైనన్ని ఇతర భాషల్లో విడుదలయ్యేటట్లు ముందుగానే ప్రణాళికలు రచించుకోవాలి. యువతతో ఉరకలేస్తున్న టాలీవుడ్ పర భాషా నటులకు తెలుగు వాడి పవరేంటో చూపించాలి. చిరంజీవి , బాల క్రిష్ణ , నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర నటులంతా తెలుగు కి మాత్రమే పరిమితమయ్యారు వీరిలా కాక నేటి తరం నటులు ద్వి భాషా చిత్రాలపైన తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. తెలుగులో ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను కొన్ని జాగ్రత్తలు తీసుకోని డబ్ చేసి, మన హీరో లతో కలిసి చెన్నై లో ఇంకొంచెం ప్రమోషన్ చేస్తే చాలు.

ఆ తరం తమిళ హీరోలు చూపిన దారిలోనే ఇవ్వాల్టి కొత్త తరం తమిళ హీరోలు దూసుకుపోతున్నారు. విక్రం అపరిచితుడు, మల్లన్న, విలన్ గా తెలుగు లోకి ఎంటర్ అయ్యాడు. సూర్యా గజిని తో మొదలుపెట్టి ఆరు, దేవా, ఘటికుడు, యముడు అంటూ తెలుగు గోల్ పోస్ట్ పైన దాడి చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న తమిళ యువ కధానాయకుడైన కార్తీ వరుసగా యుగానికొక్కడు, ఆవారా అంటూ తన ప్రతీ తమిళ సినిమాని తెలుగు లో విడుదల చేసి మార్కెట్ పెంచుకుంటున్నాడు. వీరిని మన తెలుగు నటులు, నిర్మాతలు అనునసరించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, దక్షిణాదిని తెలుగు చిత్ర పరిశ్రమ పాలించే రోజులు మరెంతో దూరంలో ఉండవు.

తెలుగు నిర్మాతలు తమ ప్రతి సినిమాని అనువదించి ఇతర భాషల్లో విడుదల చేయటానికి సన్నద్ధం కండి.రీమేక్ రైట్స్ అమ్ముకోకండి. డబ్బింగ్ చేసే సందర్భంలో అనువాద కళాకారుల గొంతు ఎంపికలోను, అనువాద మాటల మరియు పాటల రచయితల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. సుడి బాగుంటే మీపైన కనక వర్షం కురవొచ్చు....


    ఇప్పటికే తమిళ, మళయాల భాషల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రాంచరణ్ సరసన మరింతమంది యువ హీరోలు చేరాలి. ఇప్పటివరకు వారి డబ్బింగులను మనం పోషించాము. ఇక మన డబ్బింగులను వారి దగ్గర సొమ్ము చేసుకోవాల్సిన సమయం వచ్చింది.  రాజమౌళి ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన తెలుగు దర్శకులు సైతం తమిళ సినిమా కదన రంగంలో కాలు పెట్టండి.








Tollywood young heroes expanding their base: 

http://sirishallu.com/?p=162
http://www.thehansindia.info/News/Article.asp?category=2&subCategory=2&ContentId=51157
http://www.indiaglitz.com/channels/telugu/article/77773.html
http://www.telugutouch.com/updates.php?newsid=7387
http://searchandhra.com/articles/why-are-tamil-heroes-more-popular-than-telugu-heroes

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate