Saturday, October 23, 2010

ఇది విన్నారా?


  • వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
  • ఐశ్వర్యం ,అధికారం, పేరు, ప్రతిష్ట ఉన్నాయని గర్వించకు. అవి ఏవి నీతో రావు. 
  • గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్వని వారు ఎప్పటికి బాగు పడరు.
  • గుణవంతుండైన కుమారుడొక్కడుంటే చాలు, ఆ వంశం మొత్తం కీర్తిని పొందుతుంది
  • ధనం కన్నా ఆరోగ్యం ఎక్కువ విలువైనది. డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం తిరిగి సంపాదించలేం.
  • నీ ప్రతిభ గుర్తింపు పొందాలనుకుంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.
  • మేధాశక్తి క్షీణించడం మొదలైంది అనడానికి విసుగు తొలి సంకేతం.
  • ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే.
  • తెలివిగల వ్యక్తికి తప్పనిసరిగా ఎల్లప్పుడూ ఉండే లక్షణం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృత.
  • సమస్త విజయాలకు సహనమే సాధనం. గుడ్డుని పొదిగితేనే పిల్లను పొందగలం కానీ పగులకొట్టి కాదు.
  • ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
  • ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీ కంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు.
  • పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి.
  • మరీ తియ్యగా(మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా(చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు.
  • రహస్యం..నీ దగ్గరున్నంతవరకు నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీ యజమాని. 
  • ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నతపదవులు పొందినవారి వల్ల అందరికి ఇక్కట్లే. స్వశక్తితో పైకొచ్చినవారికి అల్ప బుద్ధి ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్ళ మీద నడవలేం కదా! 
  • అన్నివేళలా సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్క జిత్తులు అవసరమవుతాయి. 
  • దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు. ఆపై ఇనుపగొలుసులు.  
  • తెలియనిది అడిగితే బయటపడే అఙానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అఙానమే. 
  • విభేధాలను ఏకరువు పెట్టడం కాదు. ఏకీభావాలను గుర్తు తెచ్చుకోగలిగితే బంధాలు ఎప్పటికీ నిలుస్తాయి
  • చేయకుండా చేశామనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్విష్టి.  ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. 
  • జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలూ లేని జీవితం ఉండదు. 
  • మానసికంగా ప్రశాంతంగా జీవించాలనుకునేవాడు తప్పనిసరిగా ఏరోజుకారోజు పైనే తన దృష్టిని కేంద్రీకరించాలి. 
  • ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే కలిగే ఙానం జీవితం మొత్తం మీద గడించిన అనుభవ పాఠంతో సమానం. 
  • చెప్పిన వేళకు రాని వాడు, కాలం విలువ తెలియనివాడు. అతడు నిజాయితీ పరుడంటే నమ్మవద్దు. 
  • ఫలితం కంటే చేస్తున్న పనిపైన దృష్టి పెడితేనే విజయం సాధించవచ్చు. చేస్తున్న పనిలో ఆనందం పొందగలిగితే విజయానందం దానంతటదే వస్తుంది. 
  • సుదూరంలో అస్పష్టంగా కంపించే దానికన్నా, మిన్నగా సమీపంలో స్పష్టంగా కనిపించేది మన లక్ష్యం కావాలి. 
  • ఎవరైనా తాము చేస్తున్న పనిని ప్రేమించాలి. అప్పుడు ఎటువంటి కష్టమైన పనైనా సరే సృజనాత్మక స్థాయికి చేరుకుంటుంది. 

India in Modi Rule 2014-24

Translate