panthangi samba-నేటి భారతం
Friday, March 22, 2024
Saturday, July 27, 2019
ఆంధ్ర కొత్త సి.ఎం ఈ విషయంలో ఎందుకు తొందరపడుతున్నారో ?
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తెలంగాణ తో కలిసి గోదావరి జలాల
వినియోగం పేరుతో మరో చారిత్రాత్మక తప్పిదం చేయబోతుందా అంటే ప్రస్తుతానికి అవుననే అభిప్రాయం
ఆంధ్ర ప్రజల్లో నెలకొని ఉంది.
రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పైన హక్కుతో
పాటు ఎన్నో ఆస్తులు కోల్పోయారు ఆంధ్రా ప్రజలు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య
ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అమరావతి పైన విషం కక్కుతుంది. హైదరాబాద్
ని తలదన్నే రాజధాని నవ్యాంధ్ర ప్రదేశ్ లో రూపుదిద్దుకోబోతుందనే ఆశలపైన కొత్త ప్రభుత్వం
నీళ్ళు చల్లింది.
ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్
ల పైన దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన ప్రభుత్వం తెలంగాణ తో నీటి జలాల
వినియోగం లో తొందర పడుతుందనేది సగటు ఆంధ్రుడి ఆవేదన.
నీరే జీవితం, నీరే భవిష్యత్ తరాలకు ఆధారం.
చెన్నై , బెంగళూరు ల లో నీటి కష్టాలు, కర్నాటక-తమిళనాడు మద్య వివాదాలు తెలిసిందే.
నిపుణుల కమిటీ తో చర్చించి, ఎగువన ఉన్న తెలంగాణ పైన నీటి కోసం ఆధారపడని విధంగా , తెలంగాణ
తరపున వచ్చే ప్రతిపాదన ని గుడ్డిగా ఆమోదించకుండా పూర్తి ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ భుభాగం
గుండా వెళ్ళే విధంగా తక్కువ ఖర్చుతో కూడినదైతేనే ఆమోదించాలి. పయ్యావుల కేశవ్ మరియు
చంద్రబాబు మాటల్లో వినండి కొత్త ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక జరిగే అనర్దాలు.
Thursday, April 4, 2019
ఆంధ్ర ప్రదేశ్ కి 2019 లో బాబు మరలా సి.ఎం ఐతే కలిగే లాభాలేంటి?
#APwithCBNin2019
2019 అంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వోట్ వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలివైన నాయకుడిని ఎన్నుకోండి.
1. పోలవరం ప్రాజెక్ట్ తప్పకుండా అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. కేంద్రం
నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించి పోలవరాన్ని పూర్తి చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్ర బాబు నాయుడు మాత్రమే.
2. క్రిష్ణా జలాల పంపిణీ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల కుయుక్తులను సమర్ధంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాలని కాపాడతాడు.
3. అమరావతి స్వచ్చ మరియు ట్రాఫిక్ రహిత నగరంగా , ఉత్తమ
నివాస యోగ్య నగరంగా, అనంద
నగరంగా నిర్మించబడుతుంది. ఉపాధి
మరియు పెట్టుబడుల ఆకర్షణ విషయంలో దక్షిణ భారత దేశంలో పెద్ద నగరాలైనా చెన్నై , బెంగుళూరు
, హైదరాబాద్ నగరాలకు సరి తూగే ధీటైన నగరంగా అమరావతి నిలిచిపోతుంది.
4. జల రవాణా , పోర్ట్
ఆధారిత అభివృద్ధి లో దూసుకుపోతుంది. ఇచ్చాపురం
నుండి తడ వరకు రూపొందించే బీచ్ రోడ్ భావనపాడు, విశాఖ
, గంగవరం , కాకినాడ,
మచిలీపట్నం, నిజాంపట్నం,
రామాయపట్నం, క్రిష్నపట్నం,
దుగ్గరాజపట్నం పోర్ట్లను అనుసంధానిచడమే కాకుండా జాతీయ రహదారులతో అనుసంధానం జరుగుతుంది.
5. రాయలసీమ లొని అన్ని మారుమూల ప్రాంతాలకి సాగు తాగు నీరు అందించి కరవు సమస్య నివారించబడుతుంది.
6. పట్టిసీమ స్ఫూర్తి తో మరిన్ని నదుల అనుసంధానం జరుగుతుంది తద్వారా రాష్ట్రం లో తాగు సాగు నీటి కష్టాలు కనుమరుగవుతాయి.
7. సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
8. రాష్ట్రం లో ఆటో , ఫైనాన్షియల్
, మొబైల్, ఎలక్ట్రానిక్
, వైద్య పరికరాలు తయారీ, ఐ.టి తదితర రంగాల్లో అగ్ర పధంలో ముందుకెళుతుంది.
9. అన్ని ప్రభుత్వ శాఖలు ఆన్ లైన్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అన్ని
ప్రభుత్వ సేవలు మొబైల్ లోకి అందుబాటులోకి వస్తాయి.
10. సాగు నీరు సకాలంలో అందడంతోపాటు, అన్నదాత
సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు తగినత పెట్టుబడి సాయం అంది వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
11. శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. స్మార్ట్
పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో
నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.
12. కేంద్రం తో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అలుపెరుగని పోరాటం కొనసాగుతుంది.
13. అన్ని ప్రాంతాలు సమతుల అభివృద్ధి
సాధిస్తాయి.
14. ప్రత్యేక హోదా సాధించేవరకు నిరంతర ప్రయత్నాలు , పోరాటాలు
చట్ట సభల ద్వారా కొనసాగుతాయి.
15. తెలంగాణతో నీళ్ళు, విభజన
ఆస్తులు , కరెంట్
బకాయీల విషయంలో అంధ్ర ప్రదేశ్ ఎలాంటి రాజీ పడాల్సిన పరిస్థితి తలెత్తదు.
Sunday, January 21, 2018
రానున్న 3 సంవత్సరాల్లో అమరావతి కి తరలి రానున్న ప్రముఖ సంస్థలు,విద్యాలయాలు
1.వెల్లూరు ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజి
(వి.ఐ.టి.ఆంధ్ర ప్రదేశ్) - 200 ఎకరాలు - 8000 ఉద్యోగాలు
2.ఇండో-యుకె ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ (ఇండో-యుకె ఆరోగ్య విద్యాలయం) - 150 ఎకరాలు
- 10000 ఉద్యోగాలు
3.నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ డిజైన్ ( జాతీయ ఆకృతుల విద్యాలయం) - 50 ఎకరాలు -90 ఉద్యోగాలు
4.ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కార్యాలయం - 25 ఎకరాలు - 80 ఉద్యోగాలు
5.తిరుమల తిరుపతి దేవస్థానం - వేంకటేశ్వర స్వామి ఆలయం - 25
ఎకరాలు - 120 ఉద్యోగాలు
6.సెంట్రల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టూల్ డిజైన్ (జాతీయ పనిముట్ల విద్యాలయం)-5 ఎకరాలు- 30 ఉద్యోగాలు
7.యస్.ఆర్.ఎం. విశ్వ విద్యాలయం - 200 ఎకరాలు - 6700 ఉద్యోగాలు
8.అమృత విశ్వ విద్యాలయం - 200 ఎకరాలు - 12000 ఉద్యోగాలు
9.సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ - 28 ఎకరాలు - 5551 ఉద్యోగాలు.
10.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - రాష్ట్ర కార్యాలయం - 11 ఎకరాలు -426 ఉద్యోగాలు.
11.బి.ఆర్.శెట్టి మెడికల్ సిటి - 100 ఎకరాలు - 6700 ఉద్యోగాలు
12.తుళ్ళూరు సబ్ డివిజన్ పోలిస్ కార్యాలం, ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ - 1.5 ఎకరాలు
- 429 ఉద్యోగాలు.
13.భారత నావికాదళం బోట్ రెస్క్యు ట్రైనింగ్
ఇన్స్టిట్యుట్ -15 ఎకరాలు - 1300 ఉద్యోగాలు.
14.జాతీయ ఫ్యాషన్ విద్యాలయం - నిఫ్ట్ - 10 ఎకరాలు
15.కేంద్రియ విశ్వ విద్యాలయం - 1 : 5
ఎకరాలు - 50 ఉద్యోగాలు.
16.కేంద్రియ విశ్వ విద్యాలయం - 2 : 5
ఎకరాలు - 50 ఉద్యోగాలు.
17.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.యస్) కార్యాలయం - 0.3 ఎకరాలు - 40 ఉద్యోగాలు.
18.పోస్టల్ కార్యాలయం - 5.5 ఎకరాలు - 300 ఉద్యోగాలు
19.నేషనల్ బయో డైవర్సిటి మ్యూజియం - 25 ఎకరాలు - 250 ఉద్యోగాలు
21.ఎల్.ఐ.సి. కార్యాలయం - 0.75 ఎకరాలు - 250 ఉద్యోగాలు
22.యస్.బి.ఐ ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు - 3.3 ఎకరాలు - 600 ఉద్యోగాలు
23.ఆంధ్ర బ్యాంకు ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు -2.65 ఎకరాలు -
400 ఉద్యోగాలు
24.బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు- 1.5 ఎకరాలు
-100 ఉద్యోగాలు
25.నాబార్డ్ ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు -4.3 ఎకరాలు -300 ఉద్యోగాలు
26.రాష్ట్ర పురాతత్వ శాఖ మ్యూజియం - 8 ఎకరాలు - 400 ఉద్యోగాలు
27.ఆం. ప్ర. పౌర సరఫరా శాఖ కార్యాలయం - 0.4 ఎకరాలు
28.కాగ్ ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు - 17 ఎకరాలు - 2048 ఉద్యోగాలు
29.రైల్ ఇండియ టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్ (ఆర్.ఐ.టి.యి.యస్) కార్యాలయం- 1 ఎకరా
- 200 ఉద్యోగాలు
30.అంబేద్కర్ స్మృతి వనం - 20 ఎకరాలు - 50 ఉద్యోగాలు.
31.రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరి -
3 ఎకరాలు - 80 ఉద్యోగాలు
32.న్యు ఇండియా అస్యురన్స్ ఉద్యోగుల నివాస మరియు కార్యాలయ సముదాయాలు -1.93 ఎకరాలు
-935 ఉద్యోగాలు
33.హిందుస్తాన్ పెట్రోలియం కార్యాలయం - 0.5 ఎకరాలు - 20 ఉద్యోగాలు
34.సిండికేట్ బ్యాంకు కార్యాలయం - 1.3 ఎకరాలు - 202 ఉద్యోగాలు
35.ఎ.పి.ఎన్.ఆర్.ఐ సొసైటి కార్యాలయం - 5 ఎకరాలు - 5000 ఉద్యోగాలు
36.ఆం.ప్ర. కో ఆపరేటివ్ బ్యాంకు - 4 ఎకరాలు - 25 ఉద్యోగాలు
37.నందమురి బసవతారకం-రామారావు మెమోరియల్ కేన్సర్ హాస్పిటల్ - 15 ఎకరాలు - 800
ఉద్యోగాలు
38.జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ -50 ఎకరాలు - 400 ఉద్యోగాలు
39.ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యుట్ - 12 ఎకరాలు - 200 ఉద్యోగాలు
40.పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమి
- 12 ఎకరాలు - 80 ఉద్యోగాలు
41.బ్రహ్మ కుమారీస్ ఆధ్యాత్మిక కేంద్రం - 10 ఎకరాలు - 80 ఉద్యోగాలు
42.ఎం.ఐ.సి.యి హబ్ కన్వెన్షన్ సెంటర్
- 42 ఎకరాలు - 2000 ఉద్యోగాలు
43. 3 నక్షత్ర (స్టార్) హొటల్స్ - 4
: మొత్తం 200 ఉద్యోగాలు
44. 4 నక్షత్ర (స్టార్) హొటల్- 2 ఎకరాలు -
100 ఉద్యోగాలు
45. 5 నక్షత్ర (స్టార్) హొటల్ - 4 ఎకరాలు - 150 ఉద్యోగాలు
46. అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి పాఠశాలలు - 1000 ఉద్యోగాలు.
Friday, October 27, 2017
బుల్ రన్ తో రికార్డ్ సృష్టించిన భారత స్టాక్ మార్కెట్ ! నెక్స్ట్ ఏంటి ?
భారత స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 33100, నిఫ్టి 10300 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకు లకు 2 లక్షల కోట్ల మూల ధన పెట్టుబడి సమకూర్చాలని నిర్ణయించడంతో బ్యాంకులు పరుగు తీశాయి. బి.యెస్.ఇ బ్యాంకెక్స్ 30% లాభాలతో దూసుకెళ్ళడం మార్కెట్లు సరికొత్త స్థాయిలకి చేరడానికి కారణమైంది.
7 లక్షల కోట్లతో చేపట్టబోతున్న భారతమాల ప్రాజెక్ట్ దేశ మౌలిక రంగానికి కొత్త
ఊపు ఇవ్వబోతుంది. రోడ్ నిర్మాణ సంస్థల వృద్ధి కి భారత మాల ప్రాజెక్ట్ ఎన్నో అవకాశాలను కల్పించబోతుంది.
దేశ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో, ఆ రంగంలోని చిన్న
సంస్థలన్నిటిని పెద్ద సంస్థల గూటికి చేర్చి నాలుగు పెద్ద సంస్థలు మాత్రమే మిగిలేలా
చేసింది. టెలికాం రంగ కంపెనీలకు ఇప్పుడిప్పుడే పరిస్థితులు
కుదుటపడుతున్నాయి.
ఐ.టి మరియు ఫార్మా రంగాలకు అమెరికా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. హెచ్ 1బి సమస్యలతో ఐ.టి కంపెనీలు, యు.యెస్.ఎఫ్.డి.ఎ అనుమతుల విషయంలో ఫార్మా
కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
గడచిన సంవత్సరంలో గృహ రుణ మరియు సూక్ష్మ రుణ కంపెనీలు అత్యుత్తమ లాభాలను
నమోదు చేశాయి. విమానయాన రంగం మంచి వృద్ది కనబరచడంతో ఆ రంగాలకి చెందిన కంపెనీలు
మదుపరులకు మంచి లాభాలను పంచాయి.
చైనా లో ముడి ఖనిజాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా అంతర్జాతీయంగా ముడి
ఖనిజాలు అధిక ధరలు పలకడంతో దేశీయ కంపెనీలు మంచి వృద్ది నమోదు చేశాయి.
జి.యెస్.టి, నోట్లరద్దుతో కారణంగా తొలుత ఇబ్బందిపడిన ద్విచక్ర వాహనాలు, కార్ల కంపెనీలు 2017 ద్వితీయార్ధం లో అమ్మకాలు గణనీయంగా
పెరగడంతో గత సంవత్సరంకంటే మెరుగైన పనితీరుని కనబర్చాయి.
ఎఫ్.ఐ.ఐ ల ధాటికి ఒకప్పుడు పేక మేడలా కూలిపోయే స్టాక్
మార్కెట్లు ప్రస్తుతం దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డి.ఐ.ఐ), రిటైల్ మదుపరుల
క్రమానుగత పెట్టుబడుల(సిప్) అండతో కొత్త శిఖరాలను అధిరోహించాయి. ఇదే దూకుడు
కొనసాగినట్లైతే మార్చ్,2018 నాటికి నిఫ్టి 12500 కి చేరే అవకాశాలు పుష్కలంగా
ఉన్నాయి. భారత దేశ వృద్ధి ఫలాలు మీకు అందాలంటే స్టాక్ మార్కెట్ లలో
మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా సిప్ మొదలెట్టండి మరి.
Friday, May 19, 2017
మోడి ప్రధాని గా 3 సంవత్సరాల్లో సాధించిన విజయాలు!దృష్టి సారించాల్సిన అంశాలు!
విజయాలు :
1.జనధన్/బ్యాంకు ఖాతా-ఆధార్-మొబైల్
నంబరు అనుసంధానం
2. స్వచ్చ్ భారత్
3. పెద్ద నోట్ల రద్దు
4. బొగ్గు గనుల పారదర్శక
కేటాయింపు
5. విభజన చట్టం ప్రకారం
ఆంధ్ర ప్రదేశ్ కి కొంతమేర ప్రత్యేక సాయం: పోలవరానికి నిధులు, రెవెన్యు లోటు పూరించడం
, 24 గంటల విద్యుత్
పధకం, కేంద్ర
విద్యా సంస్థల కేటాయింపు
6. నిర్మాణ రంగ నియంత్రణా
చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ )
7. వస్తు సేవల పన్ను (
జి. యస్.టి )
9. రైల్వే పని తీరులో మెరుగుదల.
10. కరెంట్ ఉత్పత్తిలో
స్వయం సమృద్ధి
11. జమ్ము కాశ్మీర్ తో
మిగతా భారతావని కి మెరుగైన రవాణా సౌకర్యాలు.
12. ఈశాన్య భారత దేశ రాష్ట్రాలపైన
ప్రత్యేక శ్రద్ద
13. ఉద్యోగ భవిష్య నిధి
(ఈ. పి.ఎఫ్.ఓ లో) సంస్కరణలు. నగదు నిల్వల్లో 15 శాతం వరకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు.
14. పారదర్శక, నగదు రహిత
భారత ఆర్ధిక వ్యవస్థ దిశగా అడుగులు.
15. నిత్యవసర సరకుల ధరల
నియంత్రణ
16. గృహ నిర్మాణ రంగానికి
ఊతమిచ్చేందుకు బ్యాంకు నుండి తీసుకునే అప్పుపై రాయితీలు.
17. సామాన్యునికి విమాన
ప్రయాణం సాకారం చేసేందుకు గంట ప్రయాణానికి 2500 గరిష్ట ధరతో విమాన ప్రయాణ టికెట్ .
18. పొరుగు దేశాలతో సత్సంబంధాలు.
19. వాస్తవాధిన రేఖ వెంబడి
పాకిస్తాన్ వైపున ఉన్న ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడి.
20. భారత మాల, సాగర మాల
పధకాలతో మౌలిక వసతుల మెరుగుదలకు కృషి.
21. స్పష్టమైన విదేశాంగ
విధానం
22. దేశియ ఉక్కు రంగాన్ని
కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతవుతున్న స్టీల్ పై సుంకం విధింపు.
23. అంతర్జాతీయ ముడి చమురు
ధరలకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకి ఒకసారి పెట్రోల్ , డీజిల్ రేట్ల సవరింపు.
24. పర్యావరణ హిత సౌర
విద్యుత్, పవన విద్యుత్ లపైన ప్రభుత్వ ప్రత్యేక దృష్టి.
25. ముఖ్యమైన , ప్రాణాంతకమైన
జబ్బుల ను నివారించేందుకు వాడే ఔషధాల ధరల నియంత్రణ.
26. గుండె ఆపరేషన్లకు వాడే
స్టెంట్ ధరలకు కళ్ళెం.
27. సైన్యం ఆధునికీకరణ.
28. "భారత్ లో తయారి"
కార్యక్రమం ద్వారా దేశం లో తయారీ రంగంపైన ప్రత్యేక శ్రద్ధ.
29. నల్ల ధనం పైన పోరాటం
30. వి.ఐ.పి వాహనాలపైన
ఎర్ర బుగ్గ వాడే విధానానికి స్వస్తి.
31. ద్రవ్యోల్బణం ( ఇంఫ్లేషన్)
తగ్గుదల
31. అవినీతి పరుల పైన ఉక్కుపాదం
.
32. మన్ కి బాత్ ద్వారా
సామాన్యుడికి చేరువ
33. విదేశాల్లో భారత ప్రతిష్ట
ఇనుమడింపు.
34. గంగా , నర్మదా నదుల
ప్రక్షాళన.
35. సుకన్య సమృద్ది యోజన
ద్వారా ఆడ బిడ్డల భవిష్యత్ కు భరోసా.
36. బినామి చట్టం.
37. పెండింగ్ రోడ్ ప్రాజెక్ట్
లకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించడం.
38. చార్ ధాం ప్రాంతాలని
కలుపుతూ రైలు మార్గం నిర్మాణం.
దృష్టి
సారించాల్సిన అంశాలు:
1. మరిన్ని ఉద్యోగాల
సృష్టి.
2. మౌలిక వసతులైన
రోడ్లు, రైల్వే ప్రాజెక్ట్ లను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయడం.
3. ప్రభుత్వ బ్యాంకుల
మొండి బకాయిల ప్రక్షాళన.
4. విజయ మాల్యాని
భారత్ కి రప్పించడం. నల్ల ధనం సంబంధిత కేసులకు త్వరగా పరిష్కారం మరియు ఆస్తుల
స్వాధీనం.
5. ప్రభుత్వ
సంస్థలన్నిటిని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి.
6. పాకిస్తాన్ తో
మరింత కఠిన వైఖరి అవలంబించాలి.
7. విభజన చట్టం
ప్రకారం అంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ కేటాయించాలి. రాజధాని అమరావతి నిర్మాణానికి
మరిన్ని నిధులివ్వాలి.
8. విద్య, వైద్య
రంగాలని ప్రక్షాళన చేయాలి.
9. నక్సలైట్ సమస్యకి
పరిష్కారం కనుగొనడం.
10. జవాన్లకి
అత్యాధునిక యుద్ధ సామాగ్రి అందజేయడం.
11. భూగర్భ జలాల పెంపు
పై ప్రత్యేక శ్రద్ధ వహించడం.
12.
అన్ని ప్రభుత్వ సాఖల కార్యకలాపాలను అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి తేవడం.Saturday, March 11, 2017
2016 కృష్ణా పుష్కరాలపై అంధ్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక వీడియో !
2016 లో నారా చంద్ర బాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను ఎంతో అద్భుతంగా నిర్వహించింది. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ సంబరాన్ని అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందింది. కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే ఈ సందర్బంలో అందరికీ ఉత్తమ వసతులు కల్పించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పుష్కరాల పైన ప్రత్యేక వీడియో రూపొందించింది.
ప్రతి తెలుగు వాడు, ప్రతి హిందువు పాలుపంచుకోవాలనుకునే ఆ
సందర్భంలో తీసిన ప్రత్యేకమైన
వీడియో ఇది. తప్పక చూడండి.
English:
Telugu:
Saturday, October 1, 2016
శభాష్ భారత సైన్యం
గతంలో భారత దేశం పైన ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ని నిందించడం, ఆరోపణలు చేయడం తప్ప ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడేది కాదు. ఈ సారి భారత్ తన పంధా మార్చింది. దాయాదిని ఏమార్చింది. బదులు తీర్చుకుంది. పాకిస్తాన్ కి తక్షణ సమాధానం పంపి ఇక పై భారత్ గతంలో లా చూస్తూ కుర్చోదని తెలియజేసింది.
ఇది బలమైన ప్రభుత్వం దేశంలో ఎన్నికయినప్పుడు చేయగల్గిన సాహసం. ఇది ఒక్క దేశం కూడా భారత్ ని పాకిస్తాన్ పై మెరుపు దాడి తరువాత నిందించకుండా నెరిపిన దౌత్యం. ఇది మాటలతో విననప్పుడు చేతలలో చేసి చూపించడం. ఇది అంతర్జాతీయ యవనిక పై క్రీయాశీలక పాత్ర పోషించి ప్రత్యర్ధి దేశాన్ని, వారి ఉగ్రవాద సహకార నైజాన్ని ఎండకట్టి ఏకాకిని చేయడం.
సగటు భారతీయుడు ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని అప్పుడెప్పుడో ఇందిరా గాంధి హయాంలో, తరువాత వాజ్ పేయి ఇప్పుడు మోడి ద్వారా మాత్రమే చవి చూసారు. ఉరి ఘటన తరువాత సైన్యంలో ఆత్మ స్థైర్యాన్ని , భారతీయుడి మదిలో ధైర్యాన్ని, యువతలో ఉత్సాహాన్ని , ప్రతి పక్షాలను ఏకతాటి పైకి తెచ్చింది వాస్థవాధీన రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం తన మెరుపు దాడులతో విరుచుకుపడిన సందర్భం.
మోడి ప్రధాని గా భారత్ అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించడం , ఉగ్ర వాద చర్యలకు చాకచక్యంగా బదులివ్వడం , అంతర్జాతీయంగా భారత దేశాన్ని రానున్న రోజుల్లో సూపర్ పవర్ గా నిలుపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
శభాష్ మోడి, సెల్యుట్ ఇండియన్ ఆర్మి. మేమంతా మీ వెంటే.
Sunday, September 11, 2016
ఇచ్చింది తీసుకోండి..రావాల్సిన వాటి కోసం పోరాడండి
ప్రత్యేక హోదా ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం హోదాను నిరాకరించి ప్రత్యేక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఐతే ప్రత్యేక హోదా తో పాటు, విభజన చట్టంలో ని అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది.
సెప్టెంబర్ 8, 2016 న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత నిచ్చింది కాని ప్రత్యేక హోదా ఊసు మాత్రం ఎత్తలేదు. ఐతే ప్రస్తుత సందర్భంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించడం కంటే రాష్ట్ర ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని రకాల సాయాలను స్వీకరించడం మంచిది.
ఆంధ్ర రాష్ట్రానికి సెప్టెంబర్ 8, 2016 న ప్రకటించిన సాయం నామ మాత్రమే. ఈ కింది అంశాల పైన అంధ్రా నేతలు పోరాడాలి.
1. రాజధాని డి.పి.ఆర్ తయారైన వెంటనే నిర్మాణానికి మరిన్ని నిధుల కోసం పోరాడాలి.
2. పోలవరం నిర్మాణానికి మాత్రమే కాకుండా,
పునరావాసానికి కూడా కేంద్రమే నిధులు భరించేలా న్యాయ పరమైన హామీ కేంద్రం నుండి లభించే
వరకు ఒత్తిడి తేవాలి.
3. దుగ్గరాజ పట్నం భారీ ఓడ రేవుని కేంద్రం నిర్మించి నిర్వహించేటట్లు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.
4. ప్రస్తుతమిచ్చిన పన్ను రాయితీలు ఏ మాత్రం కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి సరిపోవు కనుక మరిన్ని విలువైన పన్ను రాయితీల కోసం పార్లమెంట్ లో ఎం.పి లు అందరు పోరాడాలి.
5. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు పై కేంద్రాన్ని నిలదీయాలి.
6. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యా సంస్థల సొంత భవనాలకై మరిన్ని నిధులు విదుదల అయ్యేలా, సకాలానికి పనులు పూర్తయ్యేలా జాగ్రత్త వహించాలి.
7. విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రో రవాణ వ్యవస్థలకు కేంద్ర నిధులు సాధించాలి.
Saturday, July 9, 2016
నాకు నచ్చిన వాక్యాలు / సంభాషణలు !
- క్షణం విలువ తెలియాలంటే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాడిని అడగాలంట. నిమిషం విలువ తెలియాలంటే- చుస్తూండగానే రైలు తప్పిపోయిన వాడిని అడగాలి. గంట విలువ తెలియాలంటే ఎవరి కోసమో నిరీక్షించేవారిని, రోజు విలువ తెలియాలంటే ఆకలితో గడిపిన వాడిని అడగాలంటారు.వారం విలువ తెలియాలంటే బంధువుల ఇంట్లో గడిపిన వాళ్ళను అడగాలట. నెల విలువ తెలియాలంటే జీతం అందుకున్న ఉద్యోగిని, సంవత్సరం విలువ తెలియాలంటే - కష్టపడి చదివినా ఏదో కారణాల వల్ల పరీక్ష తప్పిన విద్యార్ధిని అడిగితే కచ్చితంగా చెప్తారంటారు అనుభవజ్ఞులు .
Subscribe to:
Posts (Atom)
Translate
-
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తెలంగాణ తో కలిసి గోదావరి జలాల వినియోగం పేరుతో మరో చారిత్రాత్మక తప్పిదం చేయబోతుందా అంటే ప్రస్త...
-
గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట...
Good Sites
- బాలు ఎఫ్.ఎం - బాలు పాడిన తెలుగు పాటలు మాత్రమే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బ్రతకాలంటే ఏం చేయాలి?
- సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే?
- సినిమా అవకాశాలు తెస్తున్న లఘు చిత్రాలు
- మనిషికి భక్తి అవసరమా?
- నల్ల ధనం వెలికితీత వల్ల ఒరిగేదేమిటి?
- నా కవితలు
- ఈ సంగతి మీకు తెలుసా!
- తెలుగు పదకోశం (డిక్షనరీ)
- యూట్యూబ్ లో నేను మెచ్చినవి
- ఇంటర్నెట్ లో తెలుగు లో రాయడం ఎలా?
- Jobs,JobMaterial,Internships,Placement papers